తెలంగాణ

డెంగ్యూపై అవగాహన కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 14: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏ ఒక్క డెంగ్యూ కేసు కూడా రాకుండా జాగ్రత్త పడాలని మున్సిపల్ అధికారులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో కలిసి మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి డెంగ్యూ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు చేస్తూ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది వారంరోజుల్లో పట్టణ మొత్తం డెంగ్యూపై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఇంటి దగ్గర నిర్లక్ష్యంగా నీటి నిలువలు ఉంచితే వాటిని వెంటనే పారబోయాలని సిబ్బందికి సూచించారు. తడిచెత్త, పొడిచెత్త వేరు చేయాలని పదెపదె పట్టణ వాసులకు గుర్తు చేయాలన్నారు. డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందే విధానాన్ని ఇంటింటికి వెళ్లి వివరించాలని ఈ వ్యాధి రాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను, సూచించే కరపత్రాలను ప్రతి ఇంటి తలుపునకు అంటించాలన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలను తీసుకువచ్చామని వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వారం రోజుల తర్వాత ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాకూడదని ఈ వ్యాధి నివారణ ప్రభుత్వ భాద్యత ఒక్కటే కాదని పౌరులు కూడా ప్రతి ఒక్కరు బాద్యతగా బావించి డెంగ్యూ నివారణలో కలిసి రావాలన్నారు. పట్టణంలో పారిశుద్ద్య చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశిస్తూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి అశోక్‌టాకీస్ చౌరస్తా వరకు పారిశుద్ద్యం లేకుండా రహదారుల వెంట నీటి నిలువలు లేకుండా స్వయంగా దోమల నివారణకు నీటి నిలువల వద్ద మందులను పిచికారి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేందర్, మాజీ వైస్ చైర్మన్ రాములు, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, టీఆర్‌ఎస్ నాయకులు వెంకటయ్య, రాజేశ్వర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
*చిత్రం... మందును పిచికారి చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్