తెలంగాణ

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్ సౌకర్యం పెంచాలంటూ డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ శనివారం వరంగల్ ఎకశిల పార్కు ఎదురుగా చేపట్టిన ఒక్క రోజు నిరహార దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీ ఎం ఆసుపత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు వెంటిలేటర్లు కూడా లేకపోవడం సిగ్గుచేటన్నారు. రోగులు వెంటిలేటర్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ సమస్య ఒక్క వరంగల్ ఎంజీఎందే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉందన్నారు. రాష్ట్రంలో విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా వ్యాదులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, డెంగ్యూ రోగులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందించాన్నారు. అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత, ఉన్న వైద్యులు కూడా విధులకు హాజరుకాక పోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైద్య పోస్టుల భర్తీకి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను నియమించాలని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు పిట్టలా రాలిపోతున్నా ముఖ్యమంత్రి కేసీ ఆర్ పట్టించుకోవడం లేదన్నారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే పిడేల్ వాయించినట్లు ఉందని, రోమ్ చక్రవర్తి ఇవాల కేసీఆర్ ప్రగతి భవన్‌లో కూర్చొని తంతు చూస్తూన్న వైనాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రగతి భవన్‌లో కుక్క చనిపోతే డాక్టర్లపై కేసులు పెడుతున్న ప్రభుత్వం పిట్టల్లా ప్రజలు రాలిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అందుకు పూర్తి బాధ్యతగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం మీద కేసులు పెట్టాలా అంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రగతి భవన్‌లో కుక్క ఉన్న విలువ ప్రజలకు ఇవ్వడం లేదన్నారు. ఎజెన్సీ ప్రాంతంలో ప్రజలు విష జ్వారాలతో పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్, ప్రభుత్వంలో పెద్దలందరు కూడా టీఆర్‌ఎస్‌కు మీమంటే మీమే ఓనర్లమని కొట్టుకుంటున్నారని ఎద్దెవా చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణలో ప్రభుత్వ వైద్యం భారం అవుతుందన్నారు. పరికరాల లేమీతో కొట్టుమిట్టాడుతున్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి, వేయ్యి పడకాల సామర్ధ్యం ఉన్న సవాలక్ష సమస్యలతో రాజ్యం ఎలుతుందని విమర్శించారు. తెలంగాణలో రెండవ అతిపెద్ది ఆసుపత్రిగా ఉన్న వరంగల్ ఎంజీఎం వేయ్యి పడకలకు సరిపడ ఎక్విప్‌మెంట్ లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కట్ల శ్రీనివాస్, నమిండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... హన్మకొండ నిర్వహించిన దీక్షలో మాట్లాడుతున్న ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్