తెలంగాణ

సాగర్‌కు తగ్గుతున్న ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 14: నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి వస్తున్న వరదనీరు శనివారం నాడు కొద్ది మేరకు తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి వరకు 26 గేట్ల ద్వారా నీటి విడుదల చేసిన అధికారులు శుక్రవారం అర్ధరాత్రి నుండి 22 గేట్ల ద్వారా నీటి విడుదల చేశారు. శనివారం ఉదయం సాగర్‌కు వస్తున్న వరద నీరు తగ్గుముఖం పట్టడంతో 6 గేట్ల ద్వారా మాత్రమే నీటి విడుదల చేసిన అధికారులు శనివారం మధ్యాహ్నాం నుండి 10 గేట్ల ద్వారా, సాయంత్రం నుండి 14 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి 2,65,616 క్యూసెక్కుల నీరు వస్తుండగా ప్రస్తుతం సాగర్ జలాశయంలో 589.90 అడుగులుగా ఉంది. సాగర్ నుండి కుడి కాల్వ ద్వారా 11,367 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,629 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33,008 క్యూసెక్కులు, క్రస్టు గేట్ల ద్వారా 2,09,902 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మొత్తంగా నాగార్జునసాగర్ జలాశయం నుండి ఎగువ నుండి వస్తున్న 2,65,616 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి జూరాల, సుంకేసుల నుండి 1,94,950 క్యూసెక్కుల నీరు వస్తుండగా శ్రీశైలం నుండి 2,72,591 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.70 అడుగులుగా ఉంది.