తెలంగాణ

ఒక్క పైసా ఇవ్వలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ ఐటీ పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలంగాణ 17 శాతం వృద్ధిరేటు సాధించి రికార్డు సృష్టించామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది రూ. 1,09,219 కోట్ల విలువైన వస్తువులు ఎగుమతులు చేశామన్నారు. 2013-14లో రూ. 57,258 కోట్ల ఎగుమతులు జరిగినట్టు చెప్పారు. ఐటీఐఆర్ విధానాన్ని కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. యూపీఏ సర్కార్ లేదా ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంగానీ ఒక్కపైసా కూడా ఐటీఐఆర్ కోసం విడుదల చేయడం లేదన్నారు. గత ఐదేళ్లు కర్నాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నేతలను అడిగి వివరాలు తెలుసుకోవచ్చని ఆయన కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. టీఆర్‌ఎస్ సభ్యులు గాదరి కిషోర్ కుమార్, కేపీ వివేకానంద్, ఆవన్నగారి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు డీ. శ్రీ్ధర్ బాబు తదితరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఐటీ ఎగుమతుల విషయంలో గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు. 8 నుంచి 9 శాతం జాతీయ సగటుతో పోల్చగా తెలంగాణ 17 శాతం వృద్ధిరేటును నమోదు చేసిందన్నారు. ఐసీటీ పాలసీ, ఇమేజ్ పాలసీ, ఇన్నోవేషన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, డ్రోన్ పాలసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీ తదితర విధానాలను ప్రకటించినట్లు చెప్పారు. డొమైన్ నిర్దిష్ట కంపెనీలను ఆకర్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. వరంగల్‌లో టీ హబ్, టాస్క్, ఐటీ టవ ర్ ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌లో
ఐటీ టవర్లను నెలకొల్పుతున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికి పరిమితమైన ఐటీ కారిడార్‌ను సభ్యుల కోరికమేరకు వికేంద్రీకరణ చేసి అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ అన్నారు. శంషాబాద్‌లో ఐటీ కారిడార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయాలనికోరారు. దీనికి తగిన స్థలం ఉందన్నారు.
హైదరాబాద్‌లో ఆధునిక..
జీఎస్‌ఎంసీలో మురుగు నీటిని శుద్ధి చేసే యంత్రాంగాల సామర్థ్యం 735 ఎంఎల్‌డీగా ఉన్నదని, ఇది మొత్తంగా తయారవుతున్న 1800 ఎంఎల్‌డీ మురుగుపారుదలలో సుమారు 40.83 శాతంగా ఉన్నట్లు చెప్పారు. నగరంలో ప్రధానప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థ పాతబడిపోయిందని, ప్రస్తుతం డిమాండ్‌కు తగిన విధంగా ఉండాలంటే మురుకు పారుదల నెట్‌వర్క్‌ను రీమోడల్ చేయాల్సి ఉంటుందన్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో మురుగు పారుదల వ్యవస్థను ఆరు జోన్లుగా విభజించారన్నారు. కొత్త మురుగునీటిపారుదల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 2021 సంవత్సరానికి సమగ్రమైన మురుగునీటి పారుదల తయారీని అధ్యయనం చేసిన తర్వాత కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తామన్నారు.
అవసరమైతే అదనంగా..
రాష్ట్రంలో అన్నపూర్ణ ఐదు రూపాయలకే భోజన కేంద్రాలకు మంచి స్పందన లభిస్తోందని మంత్రి కేటీఆర్ శాసనసభకుచెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కంటోనె్మంట్ ప్రాంతంలోని 3 కేంద్రాలతో సహా ప్రస్తుతం 142 కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. ఈ పథకం కింద కనీసం 40వేల మంది వ్యక్తులు లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు. సాలీనా వీటికి రూ.26 కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు.
*చిత్రం... ఐటీ శాఖ మంత్రి కేటీఆర్