తెలంగాణ

భట్టి వర్సెస్ కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: వార్షిక బడ్జెట్‌పై కాంగ్రెస్ పక్షం నాయకుడు భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య శాసనసభలో శనివారం తీవ్ర వాగ్వివాదం జరిగింది. భట్టి విక్రమార్క మాట్లాడేందుకు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్పీకర్ పోచారం అవకాశం ఇచ్చారు. మధ్యాహ్నం 2.26 గంటల వరకు భట్టి మాట్లాడారు. విక్రమార్క మాట్లాడుతుండగా మధ్యలో అధికార పక్షం సభ్యులు అనేక పర్యాయాలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వంతో సహా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తరహా బడ్జెను ప్రవేశపెట్టలేదన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రవేశపెట్టిన ఓట్-ఆన్- అకౌంట్ బడ్జెట్‌తో పోలిస్తే, తాజాగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో 36 వేల కోట్ల రూపాయల అంచనాలు తగ్గించారన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు తగ్గించడానికి ప్రభుత్వం చెబుతున్న కారణాలు నమ్మశక్యంగా లేవన్నారు. ఇలా ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా మరో 10 వేల కోట్ల నుండి 15 వేల కోట్ల రూపాయల వరకు బడ్జెట్‌ను తగ్గించినా ఆశ్చర్యం లేదన్నారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసిన అప్పులు మూడు లక్షల కోట్ల రూపాయలకు చేరాయని భట్టి పేర్కొన్నారు. ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు నిరూపిస్తారా అంటూ ఆగ్రహంగా ప్రశించారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భట్టి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ తర్వాత భట్టి మళ్లీ మాట్లాడుతూ, ‘సీఎం గారు నన్ను మాట్లాడనివ్వాలని’ పేర్కొన్నారు. ప్రభుత్వం సభకు అందించిన పుస్తకంలోనే 11 వ పేజీలో అప్పుల గురించి ఉందని, ఇప్పటి వరకు 2.03 లక్షల కోట్ల
రూపాయల అప్పులు చేశారని, వివిధ సంస్థలకు 70 వేల కోట్ల రూపాయల మేరకు గ్యారంటీ ఇచ్చారని, కొత్తగా మరో 20 వేల కోట్ల రూపాయలపైగా అప్పు తీసుకుంటామని సూచించారని వివరించారు. ఇవన్నీ కలిపితే మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పుకాదా అని భట్టి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ చేపట్టిన ఒక నీటిపారుదల ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని ఆరోపించారు. ఈ దశలో సీఎం మళ్లీ జోక్యం చేసుకుంటూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు భక్తరామదాసు, మేడిగడ్డ తదితర ప్రాజెక్టులు కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదా అంటూ ప్రశ్నించారు.
ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, ఇందిరాసాగర్, దుమ్ముగూడెం-రాజీవ్ సాగర్ తదితర ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో ప్రారంభమయ్యాయని భట్టి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గోదావరి ఆధారిత ప్రాజెక్టులకు 31,421 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటే 36.40 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవని, అలాగే పాలమూరు-రంగారెడ్డితో సహా కృష్ణా ఆధారిత ప్రాజెక్టులకు 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటే 10.51 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవన్నారు. గోదావరి జలాల వినియోగంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలను ప్రజలకు చెబుతోందని ఆరోపించారు.
ఇలా ఉండగా ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారని, ఈ హామీ అమలు చేయలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ సమయంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, భట్టి అసంబద్ధంగా మాట్లాడుతున్నారని, ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ కేసీఆర్ హామీ ఇవ్వలేదని, ఇలా మాట్లాడితే చూస్తూ ఊరుకోం అంటూ తీవ్రంగా స్పందించారు. దాంతో భట్టి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ‘నేను కేటీఆర్ బానిసను కాను, కేటీఆర్ బెదిరిస్తున్నారా’ అంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.07 లక్షల ఉద్యోగఖాళీలు 2014 వరకే ఉండేవని, గత 63 నెలల్లో రిటైర్మెంట్ కారణంగా మరో 60 వేల పోస్టులు ఖాళీ అయ్యాయని తెలిపారు. ఉద్యోగాలకోసమే విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, చాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా గత ఐదేళ్లలో 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా, 32 వేల కోట్ల రూపాయలే ఖర్చు చేశారన్నారు. బడుగు వర్గాలకు మూడెకరాల భూమి ఇస్తామంటూ ఇప్పుడు చేతులెత్తేశారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఇవ్వలేదని, ఇందుకోసం నిధులు కేటాయించలేదని విమర్శించారు. డబల్ బెడ్‌రూం పథకం కోసం లక్ష కోట్ల రూపాయలు అవసరమని, ఇందుకు కూడా సరైన నిధులు కేటాయించలేదన్నారు. వైద్యం అందక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు.

*చిత్రాలు.. కాంగ్రెస్ పక్షం నాయకుడు భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి కేసీఆర్