తెలంగాణ

కాళేశ్వరంపై హరీశ్, జీవన్ మధ్య మాటల యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాల్లో దాగుడుమూతలు, దోబూచులాట ఆడటం ప్రభుత్వం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. దీంతో శాసన మండలిలో గందరగళం నెలకొంది. శనివారం శాసన మండలి సమావేశాల్లో సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపలేదన్న అంశాన్ని కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో బయటపెట్టినట్లు జీవన్‌రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. జీవన్‌రెడ్డి ప్రకటనపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నెలకొంది. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు ముందుకు సాగకుండా కోర్టులో కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ జీవన్‌రెడ్డిపై హరీశ్ నిప్పులు చెరిగారు. నీతి అయోగ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రశంసలు కరిపించిందని హరీశ్ గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగే సమయంలో కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరాన్ని ఎందకు జాతీయ ప్రాజెకట్టుగా ప్రకటించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందకు ప్రయత్నించలేదని హరీశ్‌రావు జీవన్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 5వేల కోట్ల రూపాయలు ప్రకటిస్తుందని ఆశించామని అయితే ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ఇరువురి మధ్య మాటల యుద్ధంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే అందుకు జీవన్‌రెడ్డి సమాధానం ఇస్తూ ప్రాజెక్టుల నిర్మాణాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, ప్రాజెక్టుల పరిధిలో ముంపునకు గురైతున్న భూముల, ఇళ్ల పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టుల పనులు ఎలా చేపడతారని హరీశ్‌ను ప్రశ్నించారు. పరిహారం కోసం కోర్టుల కెక్కడం తప్పా అంటూ జీవన్‌రెడ్డి హరీశ్‌ను నిలదీశారు. గతంలో ఏమి జరిగిందన్న అంశాలను పక్కనపెట్టి ప్రస్తుతం ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణాలపై శే్వతపత్రం విడుదల చేస్తుందా లేదా అంటూ హరీశ్‌రావును జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం కోసం కేసీఆర్ చేసిన కృషి ఫలతంగా కోటి మాగాని ఎకరాలకు కాళేశ్వం నుంచి గోదావరి నీటిని తరలిస్తున్నామన్నారు. అందుకు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ అన్న అంశాలను హరీవ్‌రావు మర్చిపోవడం దురదృష్టకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుందన్న సమాచారం ఇస్తుంటే హరీశ్‌రావు సభను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జీవన్‌రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తుంటే టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు పదేపదే అడ్డుకోవడం జరిగింది. వాస్తవాలను సభ దృష్టికి తీసుకువస్తుంటే తనను అడ్డుకోవడం ఏమిటని జీవన్‌రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. చైర్మన్ గుత్తా కలుగచేసుకుని జీవన్‌రెడ్డి మీకు ఇచ్చిన సమయం 15 నిమిషాలు మాత్రమేనని, సమయం మించిపోతోందని ప్రసంగాన్ని ముగించాలని చైర్మన్ బెల్లు కొట్టారు. దీంతో జీవన్‌రెడ్డి తనకు ఇచ్చిన సమయాన్ని హరీశ్‌రావు మాట్లాడడానికి సరిపోయిందని, మరి కొంత సమయం కావాలని చైర్మన్‌కు సూచించారు. త్వందరగా ముగించాలని గుత్తా జీవన్‌రెడ్డికి చూచించారు.
మళ్ళీ జీవన్‌రెడ్డి ప్రభుత్వం విఫలం చెందడంతో విషజ్వరాలు ప్రభలుతున్నాయని, వాటిని నివారించడానికి ప్రభుత్వ చర్యలు ఏమిటని ప్రశ్నించారు. దీంతో చైర్మన్ సమయం దాటిపోయిందని చెబుతూ ఎమ్మెల్సీ పల్లా రాజేవ్వరెడ్డిని మాట్లడాలని చైర్మన్ సూచించారు. తాను మాట్లాడుతుండాగా మరొకరికి అవకాశం ఇవ్వడం అన్యాయం అంటూ జీవన్‌రెడ్డి చైర్మన్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించి సీట్లో కూర్చున్నారు.