తెలంగాణ

తెరాస మాదిగ ఎమ్మెల్యేలు కార్యాచరణ ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో పదవులను కేటాయించకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర్‌ఎస్ ఎస్సీ ఎమ్మెల్యేలను టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ కోరారు. సమాజంలో ఒక్క శాతం ఉన్న వారికి నాలుగు మంత్రి పదవులు, నాలుగు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. పదిశాతానికి పైగా ఉన్న మాదిగలకు ఎందుకు మంత్రి వర్గంలో అవకాశం కల్పించలేదన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, పొరుగున ఉన్న ఆంధ్రాలో మాదిగలు, మాల కులాలకు మంత్రివర్గంలో సమాన ప్రాతినిధ్యం కల్పించారన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న మాదిగ ఎమ్మెల్యేలు సీరియస్‌గా కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు యురేనియంకు అనుమతి ఇచ్చాయని, దీని వల్ల కృష్ణా జలాలు కలుషితమవుతాయన్నారు. యురేనియం తవ్వకాల వల్ల నాగార్జునసాగర్ నీళ్లు విషపూరితమవుతాయన్నారు. టీపీసీసీ కార్యదర్శి మహ్మద్ సలీం, మైనారిటీ సెల్ చైర్మన్ షేక్ అబ్దుల్ సోహెల్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మైనారిటీలకు అన్యాయం జరిగిందన్నారు. మైనారిటీ సంక్షేమ పథకాలన్నింటిలో భారీ కోతను విధించారన్నారు. బడ్జెట్‌లో భారీగా కోతలు పెట్టి మైనారిటీ విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నం చేశారన్నారు. ఈ బడ్జెట్ మైనారిటీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను దూరం చేశాయన్నారు. ఇప్పటికే షాదీ ముబారక్ చెక్కులు రావడం లేదన్నారు. ముస్లింలకు ఇఫ్తార్ విందుకు నిధులు నిలిపివేశారన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి జీ నిరంజన్ మాట్లాడుతూ కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల బడ్జెట్ తగ్గిందన్నారు. యూనివర్శిటీలకు నిధులు కేటాయించలేదన్నారు. హైదరాబాద్ భూములు కేసీఆర్‌జాగీర్ అదని, అమ్ముకుంటూ పోతే ఇంచు భూమి కూడా మిగలదన్నారు.