తెలంగాణ

వేతనాల కోసం 21న పంచాయతీ ఉద్యోగుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణలో పంచాయతీ ఉద్యోగ, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కేటగిరిల వారీ వేతనాలు చెల్లించాలని కోరుతూ సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్టు సీఐటీయూ, ఎఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీజీపీయుఎస్, ఇఫ్టూలతో కూడిన కార్మికుల జాక్ పేర్కొంది. ముఖ్యమంత్రి ప్రకటించినట్టు కనీస వేతనం 8500 ఉండేలా వెంటనే జీవో జారీ చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు, ఇతర సిబ్బందికి కేటగిరిల వారీ వేతనాలు నిర్ణయించాలని జాక్ నేతలు పాలడుగు భాస్కర్, కే జయచంద్ర, కే సూర్యం, ఎన్ యజ్ఞనారాయణ్, శివబాబు డిమాండ్ చేశారు. వేతనాల చెల్లింపునకు ప్రభుత్వమే గ్రాంట్ ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పోస్టుల్లో కారొబార్, బిల్‌కలెక్టర్లను 1993లోపు సర్వీసు ఉన్న వారిని గ్రేడ్ 4 సెక్రటరీలుగా నియమించాలని అన్నారు. 1993 తర్వాత వారిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని సూచించారు.
తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాడుతున్న పంచాయతీ ఉద్యోగ, కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తోందని అన్నారు. ఆత్మగౌరవ సభ, ప్రగతి భవన్ ముట్టడి, సెప్టెంబర్ 9 కలెక్టర్ కార్యాలయాల ముందు జేఏసీ తలపెట్టిన ధర్నాల సందర్భంగా కార్మికుల్ని ముందస్తుగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించారని, ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న టీఆర్‌ఎ ప్రభుత్వం ఉద్యమాలను అణచివేయడం సబబుకాదని అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వం స్నేహపూర్వకంగా చూడాలని , ధర్నాలు, నిరసనలు చేస్తున్నారని వారిని శత్రువులుగా చూడటం సరికాదని అన్నారు. ప్రభుత్వం తక్షణమే జాక్ నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు.