తెలంగాణ

రెండు నెలల పాటు ఓటర్ వెరిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం ఈ నెల1 న ప్రారంభమైందని, మరో రెండు నెలల పాటు ఇది కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల జాయింట్ సీఈఓ రవికిరణ్ తెలిపారు. ప్రజలతో ఆకాశవాణి ద్వారా బుధవారం మాట్లాడుతూ, 2019 జనవరి 1 వరకు 18 సంవత్సరాలు నిండిన వారు తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుకోవచ్చన్నారు. ఇందుకోసం ప్రత్యేక దరఖస్తులో వివరాలు నింపి పంపించాలన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు ఉండి, కార్డుల్లో ఉన్న వివరాల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలనుకున్న వారు కూడా నిర్ణీత ఫాం ద్వారా దరఖాస్తు చేయవచ్చన్నారు. కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని రవికిరణ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కాలేజీ నుండి ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులను ఎంపిక చేస్తామని, వీరిని అంబాసిడర్లుగా పిలుస్తామన్నారు. వీరికి ఒక రోజు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఈ అంబాసిడర్లు తమ తమ కాలేజీల్లోని విద్యార్థుల్లో 18 ఏళ్లు నిండిన అందరినీ ఓటర్ల జాబితాలో చేర్పించేందుకు కృషి చేస్తారన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని వెల్లడించారు. ఓటర్లు తమకు ఏవైనా ఇబ్బందులు ఉంటే 1950 (టోల్‌ఫ్రీ నెంబర్) కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని రవికిరణ్ తెలిపారు.