తెలంగాణ

గుత్తాపై అభినందనల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ‘సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీరు శాసన మండలి సభ గౌరవాన్ని మరింత పెంచాలి’అని కొత్తగా ఎన్నికైన మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్సీలు సూచించారు. బుధవారం మండలి చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సుఖేందర్‌రెడ్డిని మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్సీలు గుత్తా నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం గురించి ప్రస్తావించారు. శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ వార్డు నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, నేడు శాసన వ్యవస్థలను నడిపించే స్థాయికి ఎదిగారని కొనియాడారు. అన్ని వ్యవస్థల పట్ల పూర్తి అవగాహన ఉన్న ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందారన్నారు. అనేక పదవులల్లో ఉండి ఆయా సంస్థల పురోభివృద్ధికి కృషి చేసిన ఘనత గుత్తాదని ఆయన పేర్కొన్నారు. రైతు సమస్యలపై, సాగు, తాగు నీటి వనరులపై ప్రభుత్వానికి అనేక సూచనలు చేశారని అన్నారు. శాసన మండలిలో అందరి మన్నలతో పాటు సభా గౌరవాన్ని మరింత పెంచాలన్నారు. కొత్త చైర్మన్ గుత్తాకు అన్ని విధాలా సహకరిస్తామని మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ చెప్పారు. శాసన వ్యవస్థల్లో అత్యున్న స్థానం గుత్తా సుఖేందర్‌రెడ్డికి దక్కడం పట్ల మంత్రి హరీశ్‌రావుప్రశంసించారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా సుఖేందర్‌రెడ్డిని దగ్గరగా సూస్తున్నానని అన్నారు. వివిధ రాజకీయ వ్యవస్థల్లో ఉన్న తెలంగాణ ఉద్యమానికి బహిరంగగా మద్దతు పలికిన వ్యక్తి సుఖేందర్‌రెడ్డి పేరు ముందు వరుసలో ఉందన్నారు. సుఖేందర్‌రెడ్డితో శాసన మండలికి నిండుదనం వచ్చిందన్నారు. విద్యార్థిదశ నుంచే గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయ ప్రస్తానం ప్రారంభం అయ్యిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బలమైన తెలంగాణ వాదిగా సుఖేందర్‌రెడ్డికి ముద్ర పడిందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులు అమలు అవుతున్నాయంటే ఆ ఘనత సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ ఫోరైడ్ బాధితుల పక్షాన నిలబడి అప్పటి ప్రభుత్వాపై వత్తిడి తీసుకువచ్చిన వ్యక్తి సుఖేందర్‌రెడ్డి అన్నారు. గుత్తాకు అజాత శత్రువుగా పేరుందని చెప్పారు. సుఖేందర్‌రెడ్డి వివాద రహితుడుగా రాజకీయాల్లో నెట్టుకొచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అందరి మన్నలను పొందిన వ్యక్తిగా గుత్తాకు పేరువచ్చిందన్నారు. పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ కోసం బిల్లును ప్రవేశపేట్టాలని డిమాండ్ చేసిన వ్యక్తిగా గుర్తింపు వచ్చిందన్నారు. మండలిలో సంఖ్యా పరంగా కాకుండా అందరికీ అవకాశం కల్పించాలని జీవన్‌రెడ్డి చైర్మన్‌కు సూచించారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఏకగ్రీవంగా మండలికి ఎన్నికైన సుఖేందర్‌రెడ్డితోతనకు మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుబంధం ఉందన్నారు. నల్గగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యపై సుఖేందర్‌రెడ్డి అప్పటి ప్రభుత్వాలతో పోరాడి సాధించుకున్నారన్నారు. తెలంగాణ ఉద్యమం జోరు సాగుతున్న సందర్భంలో చంద్రబాబును ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇప్పించామన్నారు. జిల్లాలో జరిగే అన్ని అభివృద్ధి అంశాల్లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. తమ మధ్య ఏవో గొడవలు ఉన్నాయని రాతలు రాయడం జరిగిందని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నాయకుడు గుత్తా అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుఖేందర్‌రెడ్డి కలసి గతంలో రాజకీయాల్లో పనిచేసిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ అనేక అంశాలపై సుఖేందర్‌రెడ్డి తనకు సూచనలు ఇచ్చేవారని పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాజకీయాల్లో అత్యున్నత స్థానం దక్కడం పట్ల ప్రశంసించారు. నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ తామిద్దరం నల్లగొండ జిల్లాకు చెందిన వారమన్నారు. మండలిలో తన సహకారం ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీలు జనార్దన్, కర్నే ప్రభాకర్, పల్లా రాజేశ్వరరెడ్డి, నర్సిరెడ్డి, రఘోత్తంరెడ్డి, ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడారు.