తెలంగాణ

ఆర్టీసీలో సమ్మె సైరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఆర్టీసీలో సమ్మెకు అన్ని యూనియన్లూ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే పలు కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు అందచేశాయి. తాజాగా బుధవారం తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు ఆర్టీసీ యాజమాన్యంకు సమ్మె నోటీసును అందించారు. ఈనెల 14 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటారు. సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చారు. కార్మిక సంఘం నేతలు అశ్వార్థమరెడ్డి, థామస్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని తక్షణం ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. గుర్తింపు సంఘంగా అనేక పర్యాయాలు కార్మికుల సమస్యలు పరిష్కంచాలని కోరుతున్నా యాజమాన్యం జాప్యం చేస్తోందని ధ్వజమెత్తారు. యాజమాన్యంతో ఇక తాడోపేడో తెల్చుకుంటామని అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా
సమ్మెకు సిద్ధం అయ్యాయి. ఈనెల 14 నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించాయి. కొత్తగా రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పువ్వాడ అజయ్ కుమార్‌తో కార్మిక సంఘం నేతలు చర్చించారు. సమ్మె నివారించడానికి కార్మికుల కోరికలను పరిష్కరించాలని మంత్రికి సూచించారు. మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టానని తనకు కొంత వ్యవధి ఇస్తే సమస్యలకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మంత్రి చెప్పారు. మరో రెండు రోజుల్లో కార్మిక సమస్యలు తీర్చకపోతే సమ్మెకు దిగుతామని కార్మిక నేతలు మంత్రికి సూచించారు. కాగా బుధవారం కార్మిక సంఘాల నినాదాలతో బస్సు భవనం హోరెత్తింది. బస్సు భవనంలో పరిపాలనా అంశాలపై మంత్రి అజయ్‌కుమార్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ వ్యవహారాలతో పాటు కార్మికుల అంశాలపై నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
చిత్రం... ఆర్టీసీ అధికారులతో సమీక్షిస్తున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్