తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం..సేవానిరతి పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, సెప్టెంబర్ 11: ప్రభుత్వ ఆసుపత్రులు రోగాలను నయంచేసే కేంద్రాలుగా ఉండాలని.. ఆసుపత్రికి రావాలంటేనే ప్రజలు ముక్కుమూసుకొని వచ్చే పరిస్థితి ఉండకూడదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మహబూబాబాద్‌లోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి పరిస్థితిలో చాలా మార్పు రావాల్సి ఉందని అన్నారు. తాను పరిశీలించిన భద్రాచలం ఆసుపత్రితో పోలిస్తే మహబూబాబాద్ ఆసుపత్రి పరిస్థితి ఏమాత్రం బాగోలేదని పెదవి విరిచారు. ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ మెరుగైన సేవలు అందించాలనే అంకితభావం సేవానిరతి వైద్యుల్లో ఉన్నప్పుడు కచ్చితంగా మెరుగైన సేవలు ప్రజలకు అందుతాయని తెలిపారు. ప్రజలు అపోహ పడుతున్నట్టుగా ప్రస్తుతం వస్తున్న జ్వరాలన్నీ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కావని ప్రజలు ప్రతి జ్వరానికి అధైర్యపడాల్సింది, అయోమయానికి గురికావాల్సిన అవసరం లేదన్నారు.
గ్రామాలలో హెల్త్‌క్యాంపులు విస్తృతంగా నిర్వహించాలని, ప్రతి గ్రామంలోనూ హెల్త్‌క్యాంపు నిర్వహించినట్టయతే అనేక మంది రోగులకు ప్రాథమిక దశలోనే రోగనియంత్రణ జరుగుతుందని రాజేందర్ తెలిపారు. పిహెచ్‌సిలలో విస్తృతంగా వైద్యసేవలు అందించాలని సూచించారు. దీని వల్ల జిల్లా ఆసుపత్రిలో రద్దీ కూడా తగ్గుతుందని అన్నారు. వైద్యరంగాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పనిచేస్తుందని రానున్న రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. ఎన్నోవేల కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్యశాఖపై ఖర్చుచేస్తున్న ప్రభుత్వం వైద్యులు, సిబ్బంది కొరత వంటి సమస్యలను తీర్చడంలో వెనుకడుగు వేయదని కచ్చితంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం వస్తున్న జ్వరాల్లో 98 శాతం వైరల్ జ్వరాలే ఉన్నాయని మంత్రి రాజేందర్ తెలిపారు. విషజ్వరాల విషయంలో రాష్ట్రప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైతే టెక్నికల్ సపోర్ట్ తీసుకొని రోగులను అన్నివిధాల ఆదుకుంటామన్నారు. వైద్యపరంగా నిధుల కొరత లేదని కావాల్సినన్ని మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వైద్యులు కూడా పనిచేయాలని, స్థానిక ప్రజా ప్రతినిధులు నిరంతరం వైద్యశాలలకు వెళ్తూ సౌకర్యాలు మెరుగు అయ్యేవిధంగా సామన్య ప్రజలకు సైతం ప్రభుత్వం ఆశించిన నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మానుకోట ఎంపీ మాలోతు కవిత, జిల్లాపరిషత్ చెర్‌పర్సన్ ఆంగోతు బిందు, మానుకోట, డోర్నకల్ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, డిఎస్ రెడ్యానాయక్, జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, డియంహెచ్‌వో శ్రీరాం, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ భీంసాగర్, జిల్లా పరిధిలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రం... వైద్యశాఖ సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్