తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కారానికి గెరిల్లా పోరాటాలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 11: తెలంగాణ రైతాంగా సాయుధ పోరాటం స్ఫూర్తితో రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై గెరిల్లా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర బుధవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకులు ఈ బస్సుయాత్రకు ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ సమీపంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాల్‌నర్సింహ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన నాటి నుంచి విముక్తి పొందిన వరకు జరిగిన ఘటనల గురించి ప్రజలకు వివరించేందుకే వారం రోజుల పాటు బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెండువందల సంవత్సరాల బ్రిటీష్ పాలనను అంతమొందించేందుకు సీపీఐ తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించిందని, నిజాం రాజ్యంలో భూస్వామ్య జాగీర్దార్లు, పటేలు వ్యవస్థకు వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటంలో 4500 మంది అమరులయ్యారని అన్నారు. వారి పోరాట స్ఫూర్తితోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గెరిల్లా పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. నిజాం నవాబుల పాలనలో ఊచకోతలు, రాక్షస హింసలు కొనసాగినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని సాగాలని అనేక సందర్భాలలో పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర ఘట్టాలను సువర్ణ అక్షరాలతో లిఖింపబడతాయని అన్నారని గుర్తు చేశారు. పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేరుస్తామని హామీ ఇచ్చారని, నేడు అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సీఏం కేసీఆర్ ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. నేడు కొన్ని శక్తులు తెలంగాణ సాయుధ పోరాటాన్ని విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోరారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు నిజాం నవాబులకు వ్యతిరేకంగా ఎప్పుడూ పోరాటం చేయలేదని అన్నారు. నేడు రాష్ట్రంలో ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. అమరవీరుల స్ఫూర్తితో పోరాటాలు నిర్వహించేందుకు, ప్రభుత్వ భూములను పేదలకు పంచేందుకు, ప్రభుత్వ భూములలో ఎర్ర జెండాను నాటేందుకు సీపీఐ సిద్ధంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి రాష్ట్ర కళాకారుల ప్రదర్శనలు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. సీపీఐ రాష్ట్ర నాయకులు జ్యోతి, పల్లె నరసింహ్మా, శ్రీనివాస్, అనిల్‌కుమార్, లక్ష్మీనారాయణ, ఆనంద్‌జీ, వార్ల వెంకటయ్య, జిల్లా నాయకులు ఫయాజ్, నరసింహ్మ, యేసయ్య, చంద్రవౌళి, కేశవులుగౌడ్, చెన్నదాసు పాల్గొన్నారు.