తెలంగాణ

నిమజ్జనంపై నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న మొహరం, వినాయక చివితి వేడుకలపై నగర పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నవరాత్రులు ఘనంగా పూజలందుకుంటున్న బొజ్జ గణపయ్యను గంగ వద్దకు చేర్చేందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో 20వేల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగిందని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా ఈనెల 12వ తేదీన 11వ రోజు ఫైనల్ వినాయక విగ్రహాల నిమజ్ఞనం కార్యక్రమం కొనసాగనుంది. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు 18 కిలోమీటర్ల మేర సాముహిక వినాయక ఊరేగింపు శోభాయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీసుకు చెందిన అదనపు ట్రాఫిక్ పోలీసు కమిషనర్ అనీల్ కుమార్ మాట్లాడుతూ తొమ్మిదో రోజు ఏడు నుంచి ఎనిమిది వేల వరకు వినాయకులు నిమజ్ఞనం చేయడం జరుగుతుందని తెలిపారు.