తెలంగాణ

దసరా, దీపావళికి 132 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: దసరా, దీపావళి పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 132 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. కాచిగూడ, తిరుపతి, కాకినాడ, నాందేడ్, నాగర్‌సోల్ మధ్య 132 రైళ్లను నడపడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్, నవంబర్, డిశంబర్ నెలల్లో ప్రయాణీకుల కోసం రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తారు. కాచిగూడ - కాకినాడ మధ్య 07425- 07426 (26) ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేశారు. ఈ రైళ్లు కాచిగూడ, మల్కాజిగిరి, చర్లపల్లి, నల్లగొండ మీదుగా గుంటూరు, విజయవాడ, తాడేపల్లి, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో రైలు ఆగుతుందని అధికారులు తెలిపారు. తిరుపతి- కాకినాడ మధ్య 52 రైళ్ళను ఏర్పాటు చేశారు. 07432- 07431 రైళ్ళు నడుస్తాయి. ఈ రైళ్లు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి మీదుగా కాకినాడకు చేరుకుంటుంది.
తిరుపతి- నాగర్‌సోల్-తిరుపతి మధ్య 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. 07417- 07418 రైళ్ళను నడపనున్నారు. ఈ రైళ్లు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, గుంటూరు, నడికుడి, నల్లగొండ, సికింద్రాబాద్, వికారాబాద్, బీదర్, పర్బనీ, ఔరంగాబాద్ మీదుగా నాగర్‌సోల్ చేరుకుంటుంది. నాందేడ్- తిరుపతి- నాందేడ్ మధ్య 28 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. 07607- 07608 రైళ్లు ముదుకోడ్, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, ఖాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు నెల్లూరు, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.