తెలంగాణ

మూడేళ్లలో స్కైవేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: ‘చైనా వంటి దేశాల్లోనే కాదు, మూడేళ్లలో భాగ్య నగరంలో కూడా స్కైవేలు చూడబోతున్నాం. కెబిఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో గ్నల్స్ లేకుండా మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లను నిర్మించబోతున్నాం’ అని పంచాయతీరాజ్ మంత్రి కె తారక రామారావు చెప్పారు. నగరం నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే మార్గాల్లోనూ ఇలాంటి స్కైవేల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకు కేంద్రం నిధులు మంజూరు చేసి సహకరించాలని కోరారు. కెబిఆర్ పార్కు, మైండ్ స్పేస్, అయ్యప్ప సొసైటీ ప్రాంతాల్లో రూ. 886 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన స్కైవేలు, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, ఇతర మంత్రులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం 71లక్షల వ్యయంతో రూపొందించిన జపనీస్ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ నగరాభివృద్ధి కోసం అన్ని పార్టీలు రాజకీయాలకతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా కోటి పై చిలుకు ఉందని, రాబోయే పదేళ్లలో పది కోట్లకు చేరుకునే పరిస్థితులున్నాయని, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రూ. 20వేల కోట్లతో భారీ ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఎండాకాలం కూడా కరెంటు కోతల్లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దేనన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఆగమాగం చేసిన పార్టీలకు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని కెటిఆర్ అన్నారు.
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ నగరాభివృద్దికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువస్తానన్నారు. డబుల్ బెడ్ రూం స్కీం చాలా చక్కటి పథకమని, ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం నిర్మించే ఒక్కో ఇంటికి కేంద్రం రూ. 2లక్షలు మంజూరు చేస్తుందని, ఎన్ని లక్షల ఇళ్లు నిర్మించినా, నిధులు మంజూరు చేయించే బాధ్యత తనదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావు కూడా ప్రసంగించారు. ఎంపి కె కేశవ్‌రావు, జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...
కెబిఆర్ పార్కు, మైండ్ స్పేస్, అయ్యప్ప సొసైటీ ప్రాంతాల్లో రూ. 886 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన స్కైవేలు, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేస్తున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు