తెలంగాణ

పోడు భూముల సమస్యలకు ఐక్య పోరాటాలతోనే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, ఆగస్టు 25: చట్టబద్ధత లేకుండా ఎస్టీలైన లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలోని రెడ్డి కళ్యాణ మండపంలో ఎంపీ సోయం బాపురావు ఆత్మీయ అభినందన సభ, ఆదివాసీల సమ్మేళనం సువర్ణపాక జగ్గారావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. తొలుత పాఖాల జయలక్ష్మీ సెంటర్ నుండి ఆకుపచ్చ జెండాలతో సమ్మేళనం జరిగే రెడ్డి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈసందర్భంగా ఎంపీ సోయం మాట్లాడుతూ ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమం చేయడానికి మీ ప్రాంతానికి వచ్చానని చెప్పారు. ఆదివాసీలు అందరూ ఒక్కటై హక్కుల సాధన కోసం పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఏజెన్సీలో పోడు భూముల సమస్యలను స్థానిక ఆదివాసీ నాయకులు కలిసికట్టుగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. తన ప్రాణమున్నంత వరకు ఆదివాసీల కోసం పోరాటం చేస్తానని స్పష్టంచేశారు. డిసెంబర్ 9న ఢిల్లీలో జరిగే ఆదివాసీల సభకు ఆదివాసీలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఆదివాసీలు అస్థిత్వం, మనుగడ కోసం పోరాటం చేయాలన్నారు. ఏజెన్సీలో గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలిచ్చేది పోయి, ఆదివాసీలను అక్కడి నుండి తరిమివేస్తున్న ప్రభుత్వ విధానాలపై అసహనం వ్యక్తం చేశారు.
ఆదివాసీల హక్కుల పోరాటంలో అందరూ ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సాంబయ్య, లక్ష్మీనారాయణ, అంజయ్య, ఆగబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...ఆదివాసీల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు