తెలంగాణ

మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్దపులి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్ టౌన్, ఆగష్టు 25: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్దపులి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. మహారాష్టల్రోని చంద్రపూర్ జిల్లా గోండ్ పిప్పిరి ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని పోడ్స గ్రామ సమీపంలోని పంటచేలల్లో పులి మృతి చెంది ఉండటాన్ని గ్రామస్థులు ఆదివారం ఉదయం గుర్తించారు. వెంటనే సమాచారాన్ని ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారుల బృందం పులి కళేబరాన్ని పరిశీలించి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు. పొడ్స గ్రామానికి చెందిన సంతోష్ అంకాపూర్ అనే రైతు చేనులో పులి మృతి చెంది ఉందని మహారాష్ట్ర పోలీస్ అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలోనే పశువైద్యాధికారులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం నివేదిక రాగానే పులి మృతికి గల కారణాలు తెలుస్తాయని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.
చిత్రం...మహారాష్ట్ర సరిహద్దులో పడివున్న పెద్దపులి కళేబరం