తెలంగాణ

వరంగల్‌కు వైద్య రంగంలో ప్రత్యేక గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌కు వైద్య రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) తెలంగాణ జోన్-3 సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. వరంగల్‌లో కాకతీయ మెడికల్ కళాశాల, ఎంజీఎం ఆసుపత్రి ఉండడం వల్ల వరంగల్‌కు వైద్య రంగంలో ప్రత్యేకత సంతరించుకుందన్నారు. ఎంజీఎంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఆయన తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రిని పేదల పెన్నిధిగా మార్చాలన్న లక్ష్యంతో 1996 నుంచి ప్రత్యేకంగా కృషి చేస్తున్నానని అన్నారు.
ఎంజీఎం ఆసుపత్రి సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారన్నారు. ప్రభుత్వంతో పాటు వైద్యులు, వరంగల్ నగర ప్రముఖులు సహకరిస్తే ఆసుపత్రి పేదల పెన్నిధిగా మారుతుందన్నారు. రాష్ట్రంలోనే వరంగల్ ఎంజీఎంను మోడల్ ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో పాటు ఐఎంఏ కూడా కృషి చేయాలన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వైద్యరంగంలో అనేక సంస్కరణలు తీసుకువస్తుందన్నారు. అన్ని వృత్తులలో వైద్య వృత్తి ఎంతో గొప్పదని, ఉత్తమమైందని అన్నారు. దేవుడు మనిషికి ప్రాణం పోసాడని, అయితే వైద్యులు ప్రాణాలను నిలబెడతారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఐఎంఏ ప్రతినిధులతో పాటు వరంగల్ మేయర్ గుండా ప్రకాష్‌రావు, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... జ్యోతి ప్రజల్వన చేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ జోన్-3 సమావేశాన్ని ప్రారంభిస్తున్న మంత్రి దయాకర్‌రావు