తెలంగాణ

370 రద్దుతో జాతీయ సమైక్యత బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఆగస్టు 24: జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక అధికారులు కల్పిస్తూ వచ్చిన 370, 35ఏ రద్దుతో భారతదేశ జాతీయ సమైక్యత మరింత బలోపేతం అయిందని విజయోత్సవ సభలో వక్తలు పేర్కొన్నారు. శనివారం సోమాజీగూడలోని ఓ హోటల్‌లో రాష్ట్ర చేతన ఆధ్వర్యంలో విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు కశ్మీరి పండితులు రాహుల్ రాజ్‌ధన్, సునీల్ సరఫ్, ఆర్‌ఆర్‌ఎస్ సంఘ్ చాలక్ దుర్గారెడ్డి, సీనీయర్ పాత్రికేయులు సుధాకర్ పాల్గొని మాట్లాడారు. మోదీ ప్రభుత్వం సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయంతో చారిత్రాత్మక తప్పిదాన్ని సరిచేసినట్టు అయిందని సంఘ్ చాలక్ దుర్గారెడ్డి అన్నారు. 370 అధికరణ రద్దుతో కశ్మీర్ ప్రాంతం భారత్‌లో పూర్తిస్థాయిలో విలీనం జరిగిందన్నారు. 370 రద్దుతో కశ్మీర్‌లో వేర్పాటువాదానికి, ఉగ్రవాదానికి చరమగీతం పాడినట్టు అయిందని పేర్కొన్నారు. కశ్మీర్ విషయంలో కావాలనే కాంగ్రెస్ వాస్తవాలను ప్రజలకు తెలియకుండా దాస్తూ వచ్చిందని విమర్శించారు. కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హక్కులు తీవ్రంగా దుర్వినియోగం అయ్యాయని, ముఖ్యంగా అక్కడి పండిట్ల పట్ల ఆ ప్రాంతం నుంచి దారుణంగా తరిమి వేసిన విషయాలను కళ్లకు కట్టినట్టు వివరించారు. ఇన్నాళ్లు తాము తమ సంస్కృతి, బాష, జీవనశైలి నుంచి దూరం అయ్యామని, వాటిని తిరిగినిర్మించుకుంటామని అన్నారు. సభ ప్రారంభానికి ముందు అరుణ్ జైట్లీ మృతికి రెండు నిమిషాల పాటు వౌనం పాటించారు.