తెలంగాణ

చెక్ పవర్‌పై అయోమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: స్థానిక సంస్థలకు విడుదల చేయాల్సిన, నిధుల విషయంలో కేంద్రం-రాష్ట్రాల మద్య వివాదం చెలరేగింది. 14 వ ఆర్థిక కమిషన్ నిధుల వ్యయం విషయంపై రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన కుదరలేదు. 14 వ ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీలకు, మున్సిపాలిటీలకు చేరలేదు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధులు కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు కలిపి కేంద్రం నుండి 14 వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా 2019-20 సంవత్సరానికి దాదాపు 1,500 కోట్లు రావలసి ఉంది. ఈ నిధులు విడుదల అయ్యాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం ఎన్ని నిధులు ఇస్తే అంతే మేరకు రాష్ట్రం కూడా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కేంద్రం, రాష్ట్రం కలిపి ఇచ్చే మొత్తం నిధులు 3,000 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు చేరాల్సి ఉంది. ఈ నిధుల వ్యయానికి సంబంధించి చెక్కులపై సంతకాల అంశం పెద్ద సమస్యగా మారింది. ఇప్పటి వరకు పంచాయతీల్లో చెక్కులపై సర్పంచ్ సంతకంతో పాటు, సంబంధిత పంచాయతీ కార్యదర్శి సంతకం ఉంటే సరిపోయేది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధానానికి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన పంచాయతీరాజ్ కొత్తచట్టం ప్రకారం సర్పంచ్‌లతో పాటు ఉప-సర్పంచ్ సంతకం ఉండాలి. ఇది రాజకీయంగా పెద్ద దుమారం లేపుతోంది. సర్పంచ్‌ల సంఘాలు ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలోని సర్పంచ్‌లు కూడా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇదే అంశంపై వివాదం కొనసాగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘60 రోజుల కార్యాచరణ కార్యక్రమం’ నిధుల కొరతను ఎదుర్కోబోతోంది. గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం నిధులు లేవు. మున్సిపాలిటీలు కూడా నిధుల సమస్య ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ‘60 రోజుల కార్యాచరణ’ చేపట్టాలని నిర్ణయించారు. పారిశుద్ద్యం, శుభ్రత, గ్రామంలో చెత్తాచెదారం లేకుండా తొలగించడం, నిరుపయోగంగా ఉన్న భావులను పూడ్చడం, దోమలకు నిలయంగా ఉండే నీటీనిలువ లేకుండా చూడటం, డంపింగ్ యార్డులకు స్థలాలు, వార్షిక, పంచవర్షప్రణాళికలను రూపొందించడం, విద్యుత్ సమస్యలు తీర్చడం, హరితహారం తదితర పనులు చేపట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ నిధులు అవసరం ఉంటుంది. స్థానిక సంస్థలు వసూలు చేసే పన్నులు ఈ పనులకు సరిపోవడం లేదు. 14 వ ఆర్థిక కమిషన్ నిధులు, రాష్ట్రం ఇవ్వాల్సిన నిధులు పంచాయతీలు, మున్సిపాలిటీలకు చేరకపోవడంతో అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయి. సంతకాల సమస్యలు పరిష్కరించుకుంటే తప్ప ఈ నిధులు విడుదల అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఇలా ఉండగా గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు అధికారం చేపట్టి ఆరు నెలలు గడిచినప్పటికీ, నిధుల లేమితో వారు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టలేకపోతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం నుండి స్థానిక సంస్థలకు ఎక్కువ నిధులు వచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ గుడిసెల రాజేశంగౌడ్ ప్రయత్నిస్తున్నారు. ఇటీవల అనేక సమావేశాల్లో ఈ అంశాన్ని రాజేశం గౌడ్ ప్రస్తావించారు.