తెలంగాణ

కాళేశ్వరంలో గోదారమ్మ పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళేశ్వరం: మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన గోదావరి నది నీటితో ఉరకలు వేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది గోదావరిలో వరద బారీగా చేరడంతో గోదావరి ఉప్పొంగుతోంది. శనివారం కాళేశ్వరం వద్ద 7.98 మీటర్ల వరద ప్రవహిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు గోదావరి నది నిండుకుండలా కనువిందు చేస్తోంది. వర్షాలు శనివారం కొంత తగ్గుముఖం పట్టడంతో గోదావరికి వరద ఉద్ధృతి తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతం వరదతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. గోదావరి నదిలో లోతుకు వెళ్లకుండా మెట్లపై స్నానాలు చేసే విధంగా వాలంటీర్లను ఏర్పాటు చేశారు.

చిత్రం...కాళేశ్వరం క్షేత్రంలో నిండుకుండలా కనిపిస్తున్న గోదావరినది