తెలంగాణ

ముదిరాజ్‌లకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్‌లకు ప్రాధాన్యం ఇచ్చారని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. నగరంలోని ఖైర్‌తాబాద్‌లోని ఇంజనీర్స్ భవన్‌లో శుక్రవారం హైదరాబాద్ నగర మొదటి మేయర్ కృష్ణస్వామి 126వ జయంతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముదిరాజ్ మహాసభ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మంత్రితో పాటు రాజ్యసభలోనూ ముదిరాజ్‌లకు ప్రాతినిథ్యంను సీఎం కల్పించారని తెలిపారు. స్థానిక సంస్థల బలోపేతం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొన్నట్లు చెప్పారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంతో స్థానిక సంస్థలకు అధికారాలు పెరిగాయని, ప్రభుత్వం ఇచ్చిన ఆధికారాలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ముదిరాజ్ మహాసభలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఉప సర్పంచ్‌లను ఘనంగా సత్కరించారు.