తెలంగాణ

ప్రైవేటు వర్శిటీల బిల్లు డొల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు రూపొందించిన నియమనిబంధనలు డొల్ల అని తెలంగాణ తల్లిదండ్రుల కమిటీ నిర్వహించిన సదస్సులో వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఇచ్చిన జీవో 26లోని డొల్లతనాన్ని ఎండగట్టారు. టీపీఎ రాష్ట్ర కార్యదర్శి పగడాల లక్ష్మయ్య, విద్యార్థి, యువజన, దళిత, బీసీ సంక్షేమ తదితర సంఘాల ప్రతినిధులు మాట్లాడి ప్రభుత్వ ఉత్తర్వులను మార్చాలని డిమాండ్ చేశారు.సభ ఏకగ్రీవంగా ఈ మేరకు తీర్మానాలు చేసింది. ప్రైవేటు వర్శిటీల్లో 70 శాతం సీట్లు స్థానికులకే ఇవ్వాలని, రిజర్వేషన్ల విదానాన్ని పాటించలని, ఫ్యాకల్టీ , ఉద్యోగాల్లో కూడా స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ప్రైవేటు వర్శిటీలకు రూపొందించిన మార్గదర్శకాల్లో రాజధానిలో 20 ఏకరాల స్థలం, ఇతర ప్రాంతాల్లో 30 ఎకరాల స్థలం ఉంటే చాలని ప్రభుత్వం పేర్కొందని, ఇది ఎంత మాత్రం భవిష్యత్ అవసరాలకు చాలదని పేర్కొన్నారు. అలాగే 10 కోట్ల రూపాయిలు కార్పస్ ఫండ్, భవనాల నిర్మాణం , వసతుల కల్పన మొదలైన వాటికి 30 కోట్ల రూపాయిలు ఫిక్సిడ్ డిపాజిట్లు రూపంలో చూపించాలని పేర్కొందని ఇంతటి ఉదారవాద నిబంధనలతో రాష్ట్రానికి, విద్యార్థులకూ ఒరిగేదేముందని అన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు దండుకునేలా విద్యావ్యాపారికి ఎర్రతివాచీ పరిచారని అన్నారు. వందల ఎకరాల విశాలమైన ప్రాంగణాల్లో ఉండాల్సిన యూనివర్శిటీలకు 20 ఎకరాల్లోకి కుదించిందని, అలాంటపుడు నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ విద్యార్థులకు 25 శాతం సీట్లు మాత్రమే కేటాయించారని అది సరిపోదని, కనీసం 70 శాతం సీట్లు కేటాయించాలని అన్నారు. ఇపుడున్న కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ యూనివర్శిటీలుగా మారిపోతాయని, టీఏఎఫ్‌ఆర్సీ నిబంధనలను సైతం నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని అన్నారు. రాజ్యాంగంలో కల్పించిన ఎస్సీ, ఎస్టీ , బీసీ, ఈడబ్ల్యుఎస్ , మహిళా రిజర్వేషన్లు అమలుచేయాలని, ఫ్యాకల్టీలో 80 శాతం, సిబ్బందిలో 100 శాతం ఉద్యోగాల్లో స్థానిక తెలంగాణ అభ్యర్థులనే నియమించాలని సదస్సులో డిమాండ్ చేశారు.