తెలంగాణ

స్పెషల్ టీచర్లను ఎందుకు నియమించలేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: ప్రత్యేక అవసరాలున్న పిల్లల బోధనకు స్పెషల్ టీచర్లను నియామకంపై ప్రభుత్వ వైఖరి ఏమిటో వివరించాలని దివ్యాంగుల హక్కుల స్టేట్ కమిషనర్ బీ శైలజ పాఠశాల విద్యాశాఖ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శికి, విద్యాశాఖ కమిషనర్‌కు ఈ నోటీసులు అందజేశారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల బోధనకు స్పెషల్ టీచర్ల నియామకం తప్పనిసరైనా ప్రభుత్వం ఉదాసీన వైఖరితో వ్యవహరించడంతో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఫోరం ఫిర్యాదు చేసినట్టు జాతీయ కన్వీనర్ కల్పగిరి శ్రీను చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పెషల్ టీచర్ల నియామకానికి అవసరమైన చర్యలను చేపట్టాలని ఆయన కోరారు.