తెలంగాణ

రక్షణ రంగం ఉద్యోగులకు రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: దేశ రక్షణ రంగంలో కీలకమైన 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరణ పేరుతో స్వదేశీ, విదేశీ పెట్టుబడీదార్లకు ధారాదత్తం చేసే కేంద్ర ప్రభుత్వ చరచ్యలను నిరసిస్తూ ఆగస్టు 26న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ప్రధానకార్యదర్శి ఎంసాయిబాబు తెలిపారు. చుక్కరాములు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు ఎస్ రమ, కార్యదర్శులు జే మల్లికార్జున్, కోటంరాజు, విఎస్‌రావు, పాలడుగు భాస్కర్, జే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ దేశభక్తియుత సమ్మెకు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, యావత్ కార్మిక వర్గం, మేథావులు మద్దతుగా నిలవాలని కోరారు. 26న రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సంఘీభావ ప్రదర్శలు జరుగుతాయని, 28న హైదరాబాద్‌లో ధర్నా జరుగుతుందని అన్నారు.