తెలంగాణ

హరితహారంలో పాల్గొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఒక కర్తవ్యంగా భావించి, పాల్గొనాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పురాలోని పౌరసరఫరాల సంస్థ గోదాముల ఆవరణలో చేపట్టిన హరితహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్థికాభివృద్ధితో పాటు పర్యావరణ అభివృద్ధి కూడా హరితహారం వల్ల సాధ్యమవుతుందన్నారు. హరితహారం నిరంతరం నిర్వహిస్తున్న ప్రక్రియ అన్నారు. సహజసిద్ధంగా ఉన్న అడవులను సంరక్షించుకోవడంతో పాటు సామాజిక అడవుల పెంపకం హరితహారంలో ప్రధానమైన భాగమన్నారు. ప్రతిఒక్కరూ వీలైన ప్రతిచోట మొక్కలను నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు జి. రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పాల్గొన్నారు.