తెలంగాణ

ప్రభుత్వ పురోగతికి అద్దం పట్టిన ఫొటోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఫొటోగ్రాఫర్లు తీసిన చిత్రాలు అద్దం పడుతున్నాయని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. బేగంపేటలోని ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి ప్రారంభించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌కు మీడియాకు చెందిన ఫొటో గ్రాఫర్లు తాము తీసిన ఫొటోలు పంపించారు. ఉత్తమమైన ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్లకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చాలా మంది ఫొటోగ్రాఫర్లు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు తెలంగాణ మీడియా అకాడమీ కృషి చేయాలని సూచించారు. ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎంట్రీలకు వచ్చిన ఫొటోల్లో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేవిగా, ప్రభుత్వం చేపట్టిన విధానాలకు అద్దంపట్టేవిగా ఉన్నాయని మంత్రి కితాబిచ్చారు. ఫొటోల్లో బోనాలు, బతుకమ్మ, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధికి సంబంధించిన ఫొటోలు ఉండటం గమనార్హమన్నారు.
వేయి పదాలు పలికించలేని భావాన్ని ఒక్క ఫొటో చెబుతుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నిరాహారదీక్ష, మిలీనియం మార్చ్, శ్రీకాంతాచారి బలిదానం తదితర ఫొటోలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఫొటోగ్రాఫర్లను ఫొటో జర్నలిస్టులుగా, వీడియోగ్రాఫర్లను వీడియో జర్నలిస్టులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు అందించే సాయాన్ని ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు కూడా అందిస్తామన్నారు.
ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ దీన్‌దయాల్ తెలంగాణ జీవన చిత్రాన్ని, నిజాం పారిపాలన వైభవాన్ని తన కెమెరాలో అందంగా బందించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పేర్కొన్నారు. రాష్టస్థ్రాయి ఫొటో పోటీలకు 104 మంది ఫొటో జర్నలిస్టులు తమ ఎంట్రీలను పంపించారు. మొత్తం 1,124 ఫొటోలను పరిశీలించి వాటిలో 52 ఫొటోలను జ్యూరీ కమిటీ ఎంపిక చేసిందని సమాచార పౌరసంబంధాల కమిషనర్ అరవింద్ కుమార్ తెలిపారు. బహుమతి పొందిన ఫొటోలను టేబుల్‌బుక్‌గా త్వరలో ప్రచురిస్తామన్నారు.
ఈ పోటీలో మొదటి బహుమతి ఆంధ్రజ్యోతి నల్లగొండ ఫొటోగ్రాఫర్ ముచ్చర్ల విజయకుమార్‌కు (25,000 రూపాయలు), రెండో బహుమతిని నమస్తే తెలంగాణ హైదరాబాద్ డిప్యూటీ ఫొటో జర్నలిస్టు రజనీకాంత్‌కు (20,000 రూ.లు), మూడో బహుమతిని ఖమ్మం జిల్లాకు చెందిన చావా సంపత్‌కుమార్‌కు (15,000 రూ.లు) అందించారు.
ఈ కార్యక్రమంలో సమాచార, పౌరసంబంధాల అధికారులు నాగయ్య కాంబ్లే, కిశోర్‌బాబు, విజయ్ గోపాల్, డీఎస్ జగన్, శ్రీనివాస్ , వెంకటసురేష్, సత్యనారాయణరెడ్డి, యామిని, శౌరిరెడ్డి, బిమల్ దేవ్, జ్యూరీ సభ్యులు రవీందర్‌రెడ్డి, స్టీవెన్‌సన్, నాగరాజు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

చిత్రం...ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్