తెలంగాణ

రాష్ట్రంలో వ్యవస్థలు దివాళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: తెలంగాణ ప్రభుత్వం స్కాంలకు కేంద్రంగా మారిందని, అవినీతి పెచ్చుమీరిందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఇక్కడ ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని, ఈ దిశగా బీజేపీ శాయశక్తులా ప్రజలతో మమేకమై పోరాడుతుందని ఆయన ప్రకటించారు. అమరవీరుల త్యాగఫలితంగా అవతరించిన తెలంగాణలో ఈ రోజు పరిపాలన లేదన్నారు. కేసీఆర్ వ్యవహారశైలి వల్ల ఐదేళ్లలో కొత్తగా రూ.1.20లక్షల కోట్ల అప్పు వచ్చిందన్నారు. ధనిక రాష్టమ్రని ప్రచారం చేశారని, ఆరోగ్యశ్రీ కింద నిధుల విడుదల నిలుపుదల చేయడం వల్ల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. పాలమూరు ఎత్తిపోతల స్కీం పట్ల శీతకన్ను వేశారన్నారు. రాష్ట్భ్రావృద్ధిని పట్టించుకోని కేసీఆర్ రాయలసీమ రతనాల సీమ చేస్తానని చెప్పడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ పార్టీ తల్లీ కొడుకుల పార్టీ అని, టీఆర్‌ఎస్ ఒక తండ్రీ కొడుకుల పార్టీ అన్నారు. బీజేపీ భరతమాత ముద్దుబిడ్డల పార్టీ అన్నారు. రాష్ట్రంలో వేలాది గ్రామాలకు తాగునీరు లేదని, కాని ఇష్టం వచ్చినట్లు బార్ షాపులకు లైసెన్సులను మంజూరు చేస్తున్నారన్నారు. మజ్లిస్ ఆగడాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడిందన్నారు. టీడీపీకి చెందిననేతలు బీజేపీలో చేరడాన్ని ఆయన స్వాగతించారు.
రాజ్యసభ ఎంపీ, బీజేపీలో చేరిన గరికపాటి రామ్మోహన్‌రావు మాట్లాడుతూ, తనకు ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు మధ్య ఎటువంటి అభిప్రాయభేదాలు లేవన్నారు. కాని తెలంగాణలో మారిన రాజకీయసమీకరణల్లో టీడీపీ నిర్వీర్యమైందన్నారు. టీఆర్‌ఎస్ నియంతృత్వ పాలనను నిర్మూలించేందుకు బీజేపీలో చేరినట్లు చెప్పారు. తనకు ఎటువంటి పదవులు అక్కర్లేదని, ప్రజల పక్షాన తాను పోరాడుతానన్నారు. బీజేపీకి సైనికుడిలా పనిచేస్తానన్నారు. టీడీపీలో తాను 36 ఏళ్ల క్రితం చేరానన్నారు. తనను తెలంగాణ టీడీపీ నేతలు అవమానించారన్నారు. అందుకే బాధపడి, మానసికంగారోదించి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు చెప్పారు. టీడీపీలో అనేక మంది అద్భుతమైన నేతలు ఉన్నారని, వారికి బీజేపీలో సరైన స్థానంకల్పించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురై ఆయన కంటి తడిపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు బాగుండాలని తాను కోరుకుంటానని, కాని తెలంగాణలో మాత్రం తాను బీజేపీకి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌తో పాటు పెద్దసంఖ్యలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.
సమావేశం జరుగుతున్నంత సేపు భారత్‌మాతాకీ జై అనేనినాదాలు మిన్నంటాయి. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన కళాకారుల బృందం సాంస్కృతిక విన్యాసాలు అలరించాయి.
చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్