తెలంగాణ

రెండు కోట్ల మొక్కలు నాటిన గ్రీన్ ఛాలెంజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జోరందుకుంది. రాజ్యసభ సభ్యుడు సంతోషకుమార్ 2018 జూలైలో గ్రీన్ ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రామాన్ని ప్రారంభించారు. హరా హైతో భరా హై ( పచ్చగా ఉంటే ఇంపుగా ఉంటుంది) అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చారు.
2018లో ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సినీ నటుడు నాగార్జునను గ్రీన్ ఛాలెంజ్‌కి నామినేట్ చేశారు. కోటి మొక్కలను తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేత నాటించారు. 2019 ఆగస్టు 18 నాటికి రెండుకోట్ల ఒకటవ మొక్కను ఎంపీ సంతోష్‌కుమార్ నాటారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం ఇప్పటికే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టింది. వర్షాలు కురుస్తున్నందున గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు చేపట్టారు.
కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కరుణాకర్‌రెడ్డి, రాఘవ పాల్గొన్నారు. కాగా గ్రీన్ ఛాలెంజ్‌కు వైసీపీ ఎంపీలు మిధున్‌రెడ్డి సైతం గ్రీన్ ఛాలెంజ్‌కు తాము సైతం అంటూ ఫోస్టు చేశారు. తాను అమెరికా పర్యటనలో ఉన్నానని ఏపీకి వచ్చిన తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం చేస్తానని మిధున్‌రెడ్డి తెలిపారు.

చిత్రం...గ్రీన్ ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్