తెలంగాణ

కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయడాన్ని ఐఎఫ్‌టీయూ తీవ్రంగా ఖండించింది. ఆదివారం హైదరాబాద్ విద్యానగర్ మార్క్స్‌భవనంలో ఐఎఫ్‌టీయూ రాజకీయ శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ ప్రెసిడెంట్ ఎస్.ఎల్ పద్మ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీసుకువస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆమె తూర్పారబట్టారు. పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూ కార్మికుల హక్కులను కాలరాయడం దుర్మార్గం అన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగసంస్థలను దశలవారీగా ప్రైవేట్‌పరం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను బడా పారిశ్రామిక వేత్తలకు అప్పనంగా కట్టబెట్టడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికవర్గం తమ హక్కుల కోసం పోరాడుతూనే సమాజ మార్పునకు సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. కేంద్రం వ్యవహరిస్తున్న పరిణామ కార్యక్రమాన్ని అర్థం చేసుకుని భవిష్యత్‌లో ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయ శిక్షణా తరగతుల్లో ప్రధానంగా ఐదు అంశాలపై చర్చించామన్నారు. చారిత్రక భౌతిక వాదం, మానవ సమాజాభివృద్ధి, శ్రమదోపిడీపై ఉద్యమించడం, సోషలిజం స్థాపన, దోపిడీరహిత నిర్మూలన వంటి అంశాలపై చర్చించామన్నారు. చట్టాల సవరణకు పూనుకుని కార్మిక హక్కులను హరించివేయడం ఏమిటని ఆమె నిలదీశారు. దేశంలో కార్మిక వర్గస్థితి మన కర్తవ్యాలు అనే అంశంపై ఇప్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం మాట్లాడారు. రాజకీయ శిక్షణా కార్యక్రమాలను జిల్లాల వారీగా త్వరలో ఏర్పాటు చేస్తామని కిరణ్ అన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు హనే్మష్, నల్లన్న, రవీందర్, నర్సిరెడ్డి, మణెక్క, మల్లయ్య, భీమయ్య తదితరులు పాల్గొన్నారు
చిత్రం...ఐఎఫ్‌టీయూ రాజకీయ శిక్షణా తరగతుల్లో మాట్లాడుతున్న ఆ సంస్థ ప్రెసిడెంట్ ఎస్.ఎల్ పద్మ