తెలంగాణ

కొత్త రెవెన్యూ చట్టంపై 20న కలెక్టర్లతో సీఎం సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18:కొత్త రెవెన్యూ చట్టంపై చర్చించడానికి కలెక్టర్లతో మంగళవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశం కానున్నారు. భూ పరిపాలనలో ప్రత్యక్ష సంబంధం కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించే అంశంపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. క్షేత్రస్థాయిలో తమ అనుభవంలో ఉన్న విషయాలను, కొత్త చట్టం రూపకల్పనలో కలెక్టర్లను నుంచి తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త మున్సిపల్ చట్టం, కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. పల్లెలు, పట్టణాలలో అమలు చేయనున్న 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో కలెక్టర్లకు సీఎం నిర్దేశం చేయనున్నారు. కలెక్టర్లతో ఏర్పాటు చేసే ఈ సమావేశం రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.