తెలంగాణ

రికార్డు స్థాయిలో వరిసాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2019 ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు విస్తీర్ణం, వరిధాన్యం ఉత్పత్తిగణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో సాధారణంగా 25 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. 15 రోజుల క్రితం వరకు వరినాట్లు 10 శాతం విస్తీర్ణం కూడా మించలేదు. గత 15 రోజుల నుండి భారీ వానల వల్ల జలాశయాల్లోకి నీరు వచ్చింది. భూగర్భజలాలు కూడా పెరిగాయి. వరిసాగు విస్తీర్ణం 25 లక్షల ఎకరాలకు చేరుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. శ్రీశైలం, జూరాల, నాగార్జున సాగర్ జలాశయాలతో పాటు గోదావరి జలాల వినియోగం పెరగడంతో వరి విస్తీర్ణం సాధారణ స్థాయిని మించే అవకాశం ఉందని భావిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో బావులు, చెరువులు, కుంటల్లోకి నీరు రావడంతో వీటి కింద వరిసాగు బాగా ఉంటుందని భావిస్తున్నారు. సాధారణ విస్తీర్ణంలో వరిసాగయితే 50 లక్షల టన్నుల వరకు వరి ఉత్పత్తి అవుతుందని, రైతులు తమ కుటుంబ అవసరాలకు ధాన్యం దాచుకోగా, మార్కెట్లోకి 36 లక్షల టన్నుల నుండి 39 లక్షల టన్నుల వరిధాన్యం వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. 2018-19 ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుండి పౌరసరఫరాల శాఖ దాదాపు 35 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటల మరమ్మతులు చేపట్టడం, పూడికలు తీయడం, పరీవాహక ప్రాంతం నుండి చెరువుల్లోకి నీటిని తీసుకువచ్చే కాలువలను కూడా మరమ్మతులు చేయడం వల్ల కొద్దిపాటి వానలకే ఇవి నిండిపోతున్నాయి. ఇప్పటికే మిషన్ కాకతీయ పథకం కింద 46,531 చెరువులు, కుంటలను బాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు 80 శాతం చెరువుల మరమ్మతు చేశారు. దాదాపు 200 టీఎంసీల నీరు ఈ చెరువులు, కుంటల్లో నిలువ ఉంటున్నాయి. ఇవి కాకుండా కృష్ణా, గోదావరి తదితర నదుల ద్వారా మరో 200 టీఎంసీల నీటిని వరిసాగుకోసం వాడుతున్నారు. వీటి వల్ల వరిధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది.
వరి సాగు విస్తీర్ణం పెరగడంతో ఉత్పత్తి కూడా పెరుగుతుందన్న కారణంతో ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఖరీఫ్‌లో 36 నుండి 39 లక్షల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ పర్యాయం ధాన్యం ధరలు కూడా బాగానే ఉండటం వల్ల రైతులు వరినాట్లు వేసేందుకు మక్కువ చూపుతున్నారు. లేట్ రబీలో అంటే ఆగస్టు చివరిపక్షం నుండి సెప్టెంబర్ మొదటిపక్షం వరకు వరినాట్లు వేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు.