తెలంగాణ

ఎస్‌జీటీలకు నష్టం కలిగించే జీవో 15ను రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: సెంకడరీ గ్రేడ్ టీచర్లకు నష్టం కలిగించే జీవో 15ను కోర్టు కొట్టి వేసిన్నప్పటికీ పండిట్ , పీఈటీలు అమలు చేయాలని ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని టీఎస్‌పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు పి.విశ్వనాథ సత్యం అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని సెయింట్ బన్వర్ లాల్ ఉన్నత పాఠశాలలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎస్‌జీటీలకు నష్టం కలిగించే ఆందోళనకు మద్దతు తెలిపే సంఘాలను సెకండరీ గ్రేడ్ టీచర్లు గట్టిగా నిలదీయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో నిధుల లేమితో అవస్థపడుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. విద్యార్థులతో సంబంధం లేకుండా గతంలో ఇచ్చిన స్కూల్ గ్రాంటును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వేసవి కాలంలో మధ్యాహ్న భోజనం విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు వెంటనే ఈఎల్స్ మంజూరు చేయాలని కోరారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతి ఒక ఉపాధ్యాయుడిని నియమించి ప్రాథమిక పాఠశాల విద్యను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షలాదిమంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం కలిగించే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని లేకపోతే టీఎస్‌పీటీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గత సంవత్సరం మేలో ఇచ్చిన హామీ మేరకు ఐఆర్, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం టీఎస్‌పీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల రాజయ్య మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల సమయాలను ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఉన్నత పాఠశాల సమయాల మాదిరిగానే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి వై.వి సురేష్ కుమార్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.కిష్టారెడ్డి, వెంకటరమణ, శ్రీనివాస్, జె.విద్యాసాగర్, బాలకృష్ణ, ఠాగూర్, మదన్ సింగ్, శ్యాంసుందర్, అనిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.