తెలంగాణ

ప్రతి స్కీమ్ వెనుకా ఓ స్కామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 17: కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం రాబంధుల్లా దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.లక్ష్మణ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కలర్ సినిమా చూపిస్తున్నారని, ప్రతీ స్కీమ్ వెనుక ఓ స్కామ్ ఉందనానరు. తెలంగాణ దేశంలోనే నెం.2 అని శనివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటూ అవినీతి మయంగా మార్చేశారని కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలో అవినీతిలో తమిళనాడు రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటే తెలంగాణ 2వ స్థానంలో ఉందన్నారు. కరీంనగర్‌లో గ్రానైట్, ఇసుక మాఫియా సహజసంపద దోచేస్తుందన్నారు. తమ పనులు తాము చేసుకునేందుకు 70శాతం ప్రజలు డబ్బులు ఇవ్వందే పనులు కావడం లేదన్నారు. ప్రాజెక్టులలో కమీషన్ల రూపంలో వచ్చిన డబ్బును ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వెదజల్లుతున్నారని, అవినీతి డబ్బుతో ప్రజల ఓట్లు కొనుగోలు చేసి గద్దెనెక్కొచ్చనే ఆలోచనే తప్పా ప్రజా సేవచేయాలనే సంకల్పం టీఆర్‌ఎస్ సర్కార్‌కు కొరవడిందని, 2023లో తెలంగాణలో కమలం వికసించడం ఖాయమన్నారు. పేదలకు సంక్షేమ పథకాల పంపిణీలో ప్రతీ దాంట్లో ఓ పెద్ద స్కామే ఉందని, లాభాపేక్ష లేకుండా పని చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఇసుమంత కూడా లేదని, చీరల, గొర్రెల, బర్రెల పంపిణీలోనూ అంతా అవినీతి మయమేనని ఆరోపించారు. చంద్రబాబును బూచీగా చూపి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే ఒక రకంగా లేకపోతే అంతా తెలంగాణ ద్రోహులుగానే చిత్రీకరించే ప్రయత్నాలకు టీఆర్‌ఎస్ తెర తీస్తుందని, ఈ కుట్రలు, కుతంత్రాలు ఎండగట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. రూ.1500కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేక వైద్యసేవలు నిలిచిపోయాయని, ధనిక రాష్టమ్రైతే ఆ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు.. పేదలకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ఎందుకు అందించట్లేదని ఆయన ప్రశ్నించారు. సెక్రరియేట్ ఉన్నది కూల్చివేసి రూ.500కోట్లు ఖర్చు చేస్తామంటున్న ప్రభుత్వం పేదలకు ఆరోగ్య సేవలు అందించేందుకు డబ్బులు చెల్లించకపోవడం ఆరోగ్య తెలంగాణ అంటే ఇదేనేమోనని ఎద్దేవ చేశారు. కళ్యాణ లక్ష్మీ, షాధీముబారక్, పిల్లలకు ఉపకార వేతనాలు అందించకుండా ఆగమాగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గిరిజన ఆదివాసీ గూడాల్లో ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి విషజ్వరాలతో బాధపడుతున్నారని అన్నారు. దళితులకు 3ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇల్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. మిషన్ కాకతీయలో అక్రమాలు జరిగాయని కాగ్ తప్పుపట్టినా, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి డీపీఆర్ లేకుండానే రంగుల సినిమా చూపిస్తున్నారన్నారు. ఎంసెట్, ఇంటర్ పరీక్షల నిర్వహణ తప్పుల తడకలా మారిందని 27మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కేంద్రం నివేదిక అడిగితే సీఎం కేసీఆర్ కుట్ర అంటున్నారని, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌ను ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకొని అప్పుడు అప్ డేటెడ్ ఇప్పుడు బీజేపీలో చేరగానే ఔట్ డేటెడ్‌గా ప్రకటించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ను సమర్థిస్తే తెలంగాణ వాదులుగా వ్యతిరేకిస్తే వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్న కల్వకుంట్ల కుటుంబ పాలన కాలగర్భంలో కలిసిపోయే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ గడ్డం వివేకానంద, బీజేపీ నాయకులు కొట్టె మురళీకృష్ణ, కటకం లోకేష్, బాజోజి భాస్కర్ పాల్గొన్నారు.
చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మణ్