తెలంగాణ

సాగర్‌కు తగ్గుతున్న ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఆగస్టు 17: సాగర్‌కు తగ్గుతున్న ఇన్‌ఫ్లో 26 గేట్ల ద్వారా నీటివిడుదల నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి వస్తున్న ఇన్‌ఫ్లో గత వారం రోజులుగా చూసుకుంటే తగ్గుముఖం పడుతుంది. ప్రస్తుతం 586.20 అడుగుల నీటి మట్టం ఉంది. గత వారం రోజులుగా శ్రీశైలం నుండి 8 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వస్తుండగా శనివారానికి 6,07,991 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంటుంది. అయితే ఇప్పటికే సాగర్ జలాశయం పూర్తి స్ధాయి నీటి మట్టానికి చేరువలో ఉండడంతో వచ్చింది వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నుండి 26 క్రస్టు గేట్ల ద్వారా 5,60,630 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు కుడి కాల్వ ద్వారా 10,978 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వ ద్వారా శనివారం సాయంత్రం విడుదల చేస్తున్న నీటిని తాత్కాలికంగా నిలిపివేశారు. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు లోలెవన్ కెనాల్ ద్వారా 600 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,373 క్యూసెక్కులను మొత్తంగా 6లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాగా శ్రీశైలానికి ఎగువ నుండి వస్తున్న వరద నీరు కూడా తగ్గుముఖం పట్టింది. శనివారం సాయంత్రానికి 5,78,000క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంటుండగా ప్రస్తుతం 881.40 అడుగులుగా ఉంది.