తెలంగాణ

వరద బాధితులను వెంటనే ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకీడు, ఆగస్టు 17: పాలకీడు మండలంలోని రాజుపహాడ్, మహంకాళిగూడెం, గంగాభవానిపురం ముంపు గ్రామాలను శనివారం టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. గంగాభవానిపురంలో చేపలు పట్టుకోని జీవనోపాధిని కొనసాగించే బెస్తవారు తమ జీవనోపాధిని వరదల వలన కోల్పోతున్నామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన సాముల జైపాల్‌రెడ్డి సహకారంతో ఒక్కొక్క కుటుంబానికి 10 కేజీల బియ్యం, ఇంటికి ఒక చీరను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల వలన 4వందల ఎకరాలకు పైన పంట నష్టం జరిగిందని కాని ఈరోజు వరకు కూడా ప్రభుత్వం స్పందించిక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గరవుతున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు. వరదల వలన ట్రాన్స్‌ఫారంలు మునిగిపోయి విద్యుత్ వ్యవస్ధ స్తంభించిందని ఒకవైపు పంటలు మునిగిపోతూనే మరొకవైపునీరు లేక పంటలు ఎండ్డుతున్నాయన్నారు.
ప్రజల కష్టాలను గాలికి వదిలేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం టీఆర్‌ఎస్ నాయకులు కండువాలు కప్పి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే పనిలో పడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసిన రోడ్లే తప్ప టీఆర్‌ఎస్ ప్రభుత్వం రోడ్డుపై తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. కళ్యాణలక్ష్మికి నిధులు అందలేదని, రైతు బంధు కూడా ఇంకా రైతుల ఖాతాలో పడలేదని విమర్శించారు. బెట్టెతండా వద్ద 25కోట్ల రూపాయలతోటి లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కావడంతో పేద ప్రజల కష్టాలు వర్ణాతీతమన్నారు. ముంపు ప్రాంత ప్రజలకు సరైన మంచినీటి వసతి కూడా లేదని ప్రజల ఆరోగ్యం దెబ్బతింటూ అంటువ్యాధులు బారిన పడుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం విడ్డూరమన్నారు. వరదల వలన నష్టపోయిన రైతుల వివరాలను ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వారి సమస్యలను తీర్చేవరకు పోరాడుతామన్నారు. కార్యక్రమంలో సాముల శివారెడ్డి, ఎంపీపీ భూక్యా గోపాల్, బెట్టెతండా సర్పంచ్ మోతిలాల్, జితేందర్‌రెడ్డి, సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసచారి, నీమానాయక్‌లు పాల్గొన్నారు.

చిత్రం...గంగాభవానిపురంలో బెస్తవారికి దుస్తులు, బియ్యం పంపిణీ చేస్తున్న ఉత్తమ్