తెలంగాణ

ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించండి: రావుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించకపోవడంతో దానిని అమలు చేస్తున్న నెట్‌వర్క్ ఆసుపత్రులు సేవలు నిలిపివేయడం పట్ల తెలంగాణ టీడీపీ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పట్ల కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తక్షణం ఆరోగ్యశ్రీకి బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలు పలు రకాల రోగాలతో ఆసుప్రతులకు వస్తుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు సంబంధిత ఆసుపత్రులు బోర్డులు పెట్టడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా తమకు నిధులు విడుదల చేయాలని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. పేదల ప్రాణాలపై ప్రభుత్వానికి ఏమేరకు చిత్తశుద్ధి ఉందో ఆరోగ్యశ్రీ సేవలకు నిధుల కేటాయింపును చూస్తుంటే అర్ధమవుతోందని ఆయన అన్నారు. ఆగస్టు 15 నుంచి వైద్య సేవలు బంద్ చేస్తామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. పేదల ప్రాణాలంటే ప్రభుత్వానికి పట్టదా అని ఆయన ప్రశ్నించారు.