తెలంగాణ

కేంద్రం తీరుపై మంత్రి ఎర్రబెల్లి అసహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: తెలంగాణ గ్రామీణాభివృద్ధికి ఆశించిన నిధులను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిదని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకలసి మంత్రి ఎర్రబెల్లి శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పనులకు సకాలంలో కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో అవి నిలిచిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న మిషన్ భగీరథ, హర్‌ఘర్ జల్ పథకాలకు కేంద్రం నిధులు విడుదల చేయలేదన్నారు. పార్లమెంట్ మొదటి సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడానని నామా గుర్తు చేశారు. వచ్చే లోక్‌సభ సమావేశాల్లో నిధుల విడుదలపై కేంద్రంతో పోరాడుతానని నామా చెప్పారు.