తెలంగాణ

ఎన్నికల్లో అక్రమాలకు టీఆర్‌ఎస్ కుట్ర: విజయశాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి టీఆర్‌ఎస్ పార్టీ సమాయత్తమవుతోందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి విమర్శించారు. వార్డుల విభజన విషయంలో జరిగే అవకతవకలకు సంబంధించి హైకోర్టు తాజాగా చేసిన కామెంట్లను చూసిన తర్వాత కేసీఆర్ బరితెగించిందని అర్థమవుతుందన్నారు. వార్డుల విభజనను కంటి తుడుపు చర్యగా హైకోర్టు ప్రస్తావించిందని ఆమెచెప్పారు. ఎన్నికల నిర్వహణలో అవతవకలు జరుగుతాయని, దీనిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్టప్రతి నిర్ణయాన్ని కూడా కేసీఆర్ విమర్శించినట్లు భావించాల్సి ఉంటుందన్నారు. తమ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని చెప్పిన కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ప్రతిపక్షాలను ఓడించాలనుకోవడం కుట్ర కాదా అన్నారు.