తెలంగాణ

నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోయినపల్లి, ఆగస్టు 16 : తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు లకు గుండెకాయ లాంటిది మిడ్ మానేరు ప్రాజెక్ట్ అని దీని నిర్మాణంలో ముంపునకు గురైన నిర్వాసితులకు న్యాయంగా రావాల్సిన పరిహారం బాధితులకు అందేవిధంగా తగు చర్యలు తీసుకుంటానని, ముఖ్యమంత్రి కేసీఆర్ బాధితులకు హామీనిచ్చారు.
ఈ విషయమై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌తో తాను మాట్లాడుతానని మీరు వెళ్లి కలెక్టర్‌ని కలవండని శుక్రవారం బోయినిపల్లి ప్రజాప్రతినిధులతో ఫోన్లో ముఖ్యమంత్రి మాట్లాడారు
సీఎం కేసీఆర్ ఫోన్ సంభాషణ
కొనకటి లచ్చిరెడ్డికి ముఖ్య మంత్రి కేసీఆర్ కాల్ చేసి
ప ఏం .. లచ్చి రెడ్డి ఎలా ఉన్నావ్?
బాగున్నాను సార్..
ప ఏం ..పనులు చేస్తున్నావ్?
వరి నాట్లు వేస్తున్నాం సార్.. మీరు చేసిన కృషితో కాళేశ్వరం ప్రాజెక్ట్ నీరు పారడంతో పొలాలు సాగు చేసుకుంటున్నాం సార్.
ప మిడ్ మానేరు సమస్యలు ఏమెనా మిగులున్నాయా?
చాలా సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలి పోయాయి వారికి విన్నవించా సార్
వెంటనే సీఎం. కేసీఆర్ స్థానిక కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు కాల్ చేసి మాట్లాడి సమస్యలు వివరించి తిరిగి లచ్చిరెడ్డికి కాల్ చేసి తాను ఇప్పుడే మీ కలెక్టర్ తో మాట్లాడానని మీరు వెంటనే మీ జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లి కలవమని తెలిపారు. దీంతో లచ్చిరెడ్డితో పాటు జడ్పిటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, ఎంపీపీ వేణు గోపాల్, కలెక్టర్‌ను కలిసి బాధితుల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ రెండు రోజుల్లో విచారణ జరిపి అర్హులందరికీ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.