తెలంగాణ

బస్తీల అభివృద్ధ్దితోనే విశ్వనగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: మహానగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందాలంటే నగరంలోని ప్రతి బస్తీలోనూ అన్ని రకాల వౌలిక వసతులు కల్పిస్తేనే విశ్వనగరం సాధ్యమవుతోందని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. శుక్రవారం సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఆడిటోరియంలో కార్పెడ్ ఆధ్వర్యంలో ‘అప్పా హైదరాబాద్-నీరు,పారిశుద్ధ్యం, పరిశుభ్రత’ అనే అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ నగరంలో రోజురోజుకి బహుళ అంతస్తు భవనాలు పెరుగుతుండటంతో పాటు బస్తీలు కూడా పెరుగుతున్నాయని వివరించారు. బస్తీవాసులకు కేవలం ప్రభుత్వం తరపునే కాకుండా స్వచ్ఛత పట్ల పలు స్వచ్ఛంద సంస్థలు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. నగరంలోని కాలనీలకు సమానంగా బస్తీల్లో వౌలిత వసతులైన నీరు, విద్యుత్, రోడ్డు వంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తులు, ఫార్మా కంపెనీలతో నగరంలో కాలుష్యం పెరుగుతోందని అన్నారు. బస్తీలను అభివృద్ధి పర్చటంతో పాటు అక్కడ నివసించే బస్తీవాసుల ఆరోగ్యం, జీవన విధానం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ వాటర్ రీసోర్సు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్‌రావు మాట్లాడుతూ బస్తీలను బాగు చేస్తామన్న సంకల్పం ఉంటేనే ఇతర కాలనీలకు సమానంగా అవి అభివృద్ధి చెందుతాయని అన్నారు. మానవ మనుగడుకు ముఖ్యమైంది నీరు అని, దాన్ని తయారు చేయటం జరగదని వివరించారు. నగరంలో సుమారు 1600 బస్తీలున్నాయని, వీటిలోని ప్రజలకు పరిశుభ్రత, పారిశుద్ధ్యం, బహిరంగ మల,మూత్ర విసర్జన వంటి అంశాలపై అవగాహన కల్పించి, వారు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా సహకరించాలని అభిప్రాయపడ్డారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారుడు ఆలె లక్ష్మణ్, వాటర్ ఎయిడెడ్ హైదరాబాద్ అధికారి రాజేశ్ రంగరాజన్, కార్పెడ్ సెక్రటరీ భరత్ భూషణ్, బస్తీవికాస్ మంచ్ సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.