తెలంగాణ

మత్య్సకారులు ఆర్థికంగా ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరంగాపురం, ఆగస్టు 16: మత్య్సకారులు ఆర్థికంగా ఎదగాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేప పిల్లలను పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ శే్వతామహంతితో కలిసి వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగసముద్రం రిజర్వాయర్‌లో లక్షా 50 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాల ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ ఎగువన కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు పూర్తిగా నిండాయని, దీంతో ఎత్తిపోతలతో అన్ని చెరువులను నింపి రైతులకు, మత్య్సకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అన్నారు. అదేవిధంగా రంగసముద్రం రిజర్వాయర్ కట్టపై హరితహారంలో భాగంగా మొక్కలు పెంచి సందర్శకులనుఆకర్షించే విధంగా మొక్కలు పెంచాలని అధికారులను ఆదేశించారు. రంగసముద్రం కట్టపై మొక్కలు నాటేందుకు తవ్విన గుంతలను ఆయన పరిశీలించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించేందుకు త్వరలోనే ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో రంగసముద్రం రిజర్వాయర్ కట్టపై మొక్కలు అందంగా ఉండేలా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శే్వతామహంతి, డీఆర్‌డీఓ గణేష్, డీఎఫ్‌ఓ బాబ్జీరావులను ఆయన ఆదేశించారు. రంగసముద్రం రిజర్వాయర్ శ్రీరంగాపూర్‌కు వెళ్లే రహదారి వెంట ఉండడం, రిజర్వాయర్ చెంతనే రంగనాయక స్వామి దేవాలయం ఉండడం, అంతే కాకుండా పర్యాటక ప్రదేశంగా ఉండటం వల్ల రంగసముద్రంకట్టపై రకరకాల పూలమొక్కలు అందంగా ఉండేలా నాటాలని ఆయన సూచించారు. మొక్కలు నాటిన అనంతరం నిర్వహణ తక్కువగా ఉండాలని, దీంతో పాటు వేర్లు లోపలికి వె ళ్లి కట్ట దెబ్బతినకుండా ఉండాలని అందరినీ అకట్టుకునే విధంగా మొక్కలు ఉండాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలతో సమాచారం ఇవ్వాలని డీఎఫ్‌ఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ గాయత్రి పృథ్వీరాజ్, జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, సర్పంచు వినీలరాణి, నాయకులు గౌని బుచ్చారెడ్డి, ఆనందరాజు, కోదండరాంరెడ్డి, హరిశంకర్‌నాయుడు, కురుమయ్య, సంపత్‌నాయుడు, మత్య్సకారుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.