తెలంగాణ

జల దిగ్బంధంలో మట్టపల్లి క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, ఆగస్టు 16: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీస్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం సాయంత్రం నాటికి 45.77 టీఎంసీలకు గాను 39 టీఎంసీలకు నీరు నిల్వ చేరింది. ఔట్‌ఫ్లోగా 7.97 లక్షల క్యూసెక్కులు వస్తుండగా ఇన్‌ఫ్లోగా 7.33 లక్షల క్యూసెక్కులను 14 గేట్ల ద్వారా దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. భారీగా చేరిన బ్యాక్ వాటర్‌తో శోభనాద్రిగూడానికి వెళ్లేదారిలో వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న బుగ్గ మాదారం గ్రామానికి సంబంధించి పత్తి, ఆరటి, మునగ తోటల్లోకి వరద నీరు చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాగా వరద నీరు ఉద్ధృతికి మట్టపల్లి నర్సింహ స్వామి ఆలయం 5 అడుగుల మేర మునిగిపోయింది. వరద నీరు కరకట్ట లీకేజీల ద్వారా ఆలయంలోకి చేరుతుండడంతో గురువారం సాయంత్రమే ఉత్సవ మూర్తులతో పాటు సామాగ్రిని తమిళనాడు సత్రానికి తరలించారు. అక్కడ నుండే ఉత్సవ మూర్తుల దర్శనాలను కొనసాగిస్తున్నారు.
ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్
పులిచింతల ప్రాజెక్టును శుక్రవారం జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ సందర్శించి పరిశీలించారు. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శోభనాద్రి గూడెం, బుగ్గ మాదారం, కిష్టాపురం గ్రామాలలో సందర్శించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్ట్లు తెలిపారు. బుగ్గ మాదారం గ్రామంలోని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించేలా కృషిచేస్తామని తెలిపారు. ముంపు గ్రామాల్లో ప్రజలు ఎవరూ లేకుండా అందరినీ పునరావాసకేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ చెప్పారు. ఆయన వెంట ఆర్డీవో కిషోర్‌కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.