తెలంగాణ

కోయిల్‌సాగర్ ప్రాజెక్టును నింపాలంటూ కాంగ్రెస్ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 16: కృష్ణానదికి భారీగా వరద వస్తున్నా కోయిల్‌సాగర్ ప్రాజెక్టును మాత్రం నింపడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయకట్టు రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. ఆయకట్టు రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం హైదరాబాద్, రాయిచూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. గత వారం పది రోజుల నుండి జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చినప్పటికీ కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి మాత్రం మోటార్లను రన్ చేసి నింపడం లేదంటూ ఆయకట్టు రైతులు రోడ్డెక్కారు. దాంతో జిల్లాలో వరద ప్రవహిస్తున్న కోయిల్‌సాగర్‌కు మాత్రం కృష్ణాజలాలను మాత్రం ఎత్తిపోయడం లేదనే చర్చ మొదలైంది. వరద వచ్చిన మొదట్లో ఒకటి రెండు రోజులు మాత్రం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు మోటార్లను రన్ చేసి పర్ధిపూర్ రిజర్వాయర్‌కు కృష్ణాజలాలను ఎత్తిపోశారు. కానీ ప్రస్తుతం మోటార్లను బంద్ చేయడం ఏమిటని అంతా చర్చనీయాంశంగా మారింది. కాగా రైతులు రోడ్డెకక్కడంతో అసలు విషయం బయటకొచ్చింది. జిల్లాలో కృష్ణానది వరద ప్రవాహం బాగా ఉన్నప్పటికీ కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ఎందుకు నింపడం లేదని రాస్తారోకోలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. గంటల తరబడి కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతులు రాస్తారోకోకు దిగడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో పోలీసులు రైతులకు, కాంగ్రెస్ నాయకులకు నచ్చజెప్పినా వారు వినలేదు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డితో పాటు పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేసి దేవరకద్ర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పాలమూరు జిల్లాలో కృష్ణానది వరద ప్రవహిస్తున్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టును మాత్రం ఎందుకు నీటితో నింపడంలేదని ప్రశ్నించారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తోందని ఆలస్యంగా వరదలు వచ్చాయని ఇప్పటికైనా కోయిల్‌సాగర్ ప్రాజెక్టును నింపితే పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద జలాలను సైతం కోయిల్‌సాగర్ ప్రాజెక్టులోకి నింపే స్థితిలో లేకపోవడం విచారకరమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను 2009లో రాజకీయంగా బతికించిన పాలమూరు జిల్లా రైతాంగంపై వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులతో పాటు రైతులను సొంతపూచీకత్తుపై దేవరకద్ర పోలీసులు విడుదల చేశారు.