తెలంగాణ

ప్రపంచం చూపంతా మన రాష్ట్రం వైపే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 16: ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శుక్రవారం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చేప పిల్లలను గోదావరిలో వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్మించారని, దేశమే కాకుండా ప్రపంచం మొత్తం తెలంగాణ ప్రాజెక్టుల వైపు చూస్తుందని, 45 లక్షలకు పైగా ఎకరాల పంటలకు సాగునీరు అందడంతో పాటు మత్స్య సంపద అభివృద్ధికి కూడా ప్రాజెక్టు ఎంతో మేలు చేస్తుందన్నారు. తద్వారా మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఊహించని విధంగా మత్స్య సంపద పెరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి మొత్తం 1.04 కోట్ల చేప పిల్లలు, 26 లక్షలు రొయ్య పిల్లలు వదిలేందుకు ప్రతిపాదన ఉందని, కేవలం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే 50 లక్షల చేప పిల్లలు, 12 లక్షల రొయ్య పిల్లల ప్రతిపాదన ఉందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లిలో నది తీర ప్రాంతాలలో 12 గ్రామాలలో 546 మంది మత్స్యకారులు ఉన్నారని ఈ కార్యక్రమంతో వారు లబ్ధిపొందుతారని పేర్కొన్నారు. అంతకుముందు కాళేశ్వరం చేరుకున్న మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఆలయంలో ఘనంగా సన్మానించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి, పెద్దపల్లి జడ్పీచైర్మన్ పుట్ట మధు, స్థానిక ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, మహదేవ్‌పూర్ ఎంపీపీ బాన్సోడ రాణిరామారావు, జడ్పీటీసీ గుడాల అరుణ శ్రీనివాస్, కాళేశ్వరం ఎంపీటీసీ రేవెల్లి మమత నాగరాజు, సర్పంచ్ వసంత, మత్స్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.