తెలంగాణ

16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది జూలై నెలలో సాధారణ వర్షపాతం 373.4 మి.మీకు 302.3 మి.మీ వర్షపాతం నమోదైనట్లు భూగర్భ జల శాఖ ప్రకటించింది. దాదాపు 19 శాతం తక్కువగా వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. మొత్తం 33 జిల్లాల్లో 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం ప్లస్ 19శాతం నుంచి మైనస్ 19 శాతం వరకు నమోదైంది. ఈ జిల్లాల్లో 236 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, హైదరాబాద్, జనగాం, జోగుళాంబ, కామారెడ్డి, కరీంనగర్, కొమురం భీం, మహబూబ్‌నగర్, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణ్‌పేట్, నిజామాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, వనపర్తి, వరంగల్ అర్బన్ జిల్లాలు సాధారణ వర్షపాతాన్ని నమోదు చేసుకున్నాయి. 17 జిల్లాల్లోని 301 మండలాల్లో -20 నుంచి-59శాతం వరకు లోటుతో వర్షపాతం నమోదైంది. భద్రాది, జయశంకర్, జగిత్యాల, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజగిరి, నల్లగొండ, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, నిర్మల్, వికారాబాద్, వరంగల్ రూరల్, యాదగిరి జిల్లాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. రాష్ట్రంలో 21 మండలాల్లో -60 నుంచి -99 శాతం వరకు అల్ప వర్షపాతం నమోదైంది. కొమురంభీం జిల్లాలో లింగాపూర్ మండలం లొడ్డిగూడ గ్రామంలో భూగర్భ జలాలు 0.45 మీటర్ల లోతులో, గరిష్టంగా నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని కుడబక్షపల్లి గ్రామంలో 67.72 మీటర్లలోతులో భూగర్భ జలాల లభ్యత ఉన్నట్లు భూగర్భ జల శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని భూభాగంలో 28.7 శాతం ప్రాంతంలో ఐదు నుంచి పది మీటర్ల లోతులో 29.6 శాతం భూభాగంలో 10 నుంచి 15 మీటర్ల లోతున నీటి లభ్యత నమోదైంది. 18.7 శాతం ప్రాంతంలో 20మీటర్ల కంటే దిగువున నీటి లభ్యత ఉంది. ఈ ఏడాది జూలై నెలలో రాష్ట్రం మొత్తం మీద సగటు భూగర్భ జల నీటి లభ్యత 14.12 మీటర్లు నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో 10.92 మీటర్లు ఉండేది.గత పదేళ్లలో పోల్చితే 2009 నుంచి 2018 మధ్య సగటున భూగర్భ జల నీటి మట్టం 479 మండలాల్లో 0.01 మీటర్ల నుంచి 18.75 మీటర్లలోతుకు జల వనరులు వెళ్లాయి. 110 మండలాల్లో మాత్రం 0.01 మీటర్ల నుంచి 8.28 మీటర్లుపైకి వచ్చాయి. నాగర్‌కర్నూలు, వనపర్తి, అసిఫాబాద్, జగిత్యాల మండలాల్లోనే నీటి మట్టం పెరిగింది. కాగా సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 27మండలాల్లో 0.5 మీటర్ల లోతుకు, 33 మండలాల్లో 0.5 నుంచి ఒక మీటర్ లోతుకు, 64 మండలాల్లో 1 నుంచి 2 మీటర్ల లోతుకు, 355 మండలాల్లో రెండు మీటర్లకు పైగా లోతుకు భూగర్భ జల నీటి మట్టాలు పడిపోయాయి.