తెలంగాణ

ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: ఆరోగ్య శ్రీ కింద వెంటనే ఆసుపత్రి యాజమాన్యాలకు రాష్ట్రప్రభుత్వం బకాయిలను చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చెశారు. ఆసుపత్రుల యాజమాన్యాలు రూ.1500 కోట్లు బకాయిలు ఉన్నాయని చెబుతుంటే, రాష్ట్రప్రభుత్వం తరఫున ఉన్న ఆరోగ్యశ్రీ ట్రస్టు మాత్రం రూ.800 కోట్లు బకాయిలని చెబుతోందన్నారు. ఈ వ్యత్యాసం రూ.700 కోట్లు ఉందన్నారు. కాని మంత్రి ఈటెల రాజేందర్ మాత్రం రూ.600 కోట్ల బకాయిలు ఉన్నాయని చెబుతున్నారన్నారు. శుక్రవారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ పేదలకు ఆరోగ్య సేవలను ఉచితంగా అందిస్తామని చెప్పి ఓట్లు దండుకున్న కేసీఆర్, ఈ రోజు బకాయిలు విడుదల చేయకపోవడానికి కారణమేంటని ఆయన నిలదీశారు. రాష్ట్రప్రభుత్వం పూర్తిగా దివాలా తీసిందన్నారు. ఫీజ రీ ఎంబర్స్‌మెంట్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారన్నారు. మిగులు బడ్జెట్‌తో బంగారు తెలంగాణ అని చెప్పుకున్న కేసీఆర్ ఈ రోజు పేదల ఆరోగ్య విషయంలో ఉదాసీన వైఖరిని విడనాడాలన్నారు. వెంటనే బకాయిలను విడుదల చేయాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంలో కొత్తదనం లేదని, ప్రజలను నిరాశపరిచిందన్నారు. ఆరోగ్య శ్రీని సక్రమంగా అమలు చేయలేని పక్షంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ స్కీంలో చేరడం మంచిదని ఆయన కోరారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ బొమ్మను పెట్టాల్సి వస్తుందనే అక్కసుతోనే ఆయుష్మాన్‌భవ పథకాన్ని కేసీఆర్ అమలు చేయడం లేదన్నారు. ఈనెల 18వ తేదీన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనకు వస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ మైదానంలో భారీ ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సభ ఏర్పాట్లను శుక్రవారం బీజేపీ నేతల బృందం సందర్శించిందన్నారు. 18వ తేదీ ఆదివారం జరిగే సభలో టీడీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లను గెలుచుకునేందుకు వీలుగా నడ్డా పార్టీకేడర్‌కు మార్గనిర్దేశనం చేస్తారన్నారు. పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ శనివారం మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ సభ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. గోదావరి ఖని, మంచిర్యాలలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు.