తెలంగాణ

అనుమతుల ఉపసంహరణకు వామపక్షాల డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: నల్గొండ జిల్లా లంబాపూర్‌లో యురోనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు. జీవనోపాధి, ప్రజల ఆరోగ్యాలు, అటవీ సంపద, జీవరాశులపై పడుతున్న తీవ్ర ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఈ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను వెనక్కు తీసుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తవ్వకాలు ఆపే విధంగా చూడాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నల్గొండ జిల్లాలోని లంబాపూర్, పులిచర్ల, నామాపురం, ఎల్లాపురం గ్రామల పరిధిలో 542 హెక్టార్లలో యురేనియం తవ్వకాలు జరపాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు జారీ చేసిందని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. గతంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారని, యురేనియం గనులున్న జార్ఖండ్ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా దుర్భర పరిస్థితులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని వారు పేర్కొన్నారు. కాగా, డిఫెన్స్ ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 17న రౌండ్ టేబుల్‌ను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు కానె్ఫడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్సు జనరల్ సెక్రటరీ ఏ అజీజ్ తెలిపారు. ఈ నెల 20 నుండి 30 రోజుల సమ్మెకు వెళ్తున్న నేపథ్యంలో కార్యాచరణ రూపొందించేందుకు రౌండ్ టేబుల్‌లో చర్చిస్తామని కానె్ఫడరేషన్ అధ్యక్షుడు వీ నాగేశ్వరరావు తెలిపారు.