తెలంగాణ

చెంచుల జీవితాలతో ఆడుకోకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణలో పర్యావరణ విధ్వంసానికి తోడ్పడే యురేనియం నిక్షేపాల తవ్వకాలకు అనుమతులు నిలిపివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. యురేనియం తవ్వకాల వల్ల చెంచుల జీవితాలను చిన్నాభిన్నం చేసినట్లవుతుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద అభయారణ్యంలో ఒకటైన నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలను వెలికితీసేందుకు అనుమతి ఇచ్చినట్లయిందన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ ప్రాంతంలో, నాగార్జునసాగర్ ప్రాంతంలో లంబాపూర్ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు కేంద్రం గుర్తించిందన్నారు. ఇప్పటికే పర్యావరణ శాఖ నుంచి తవ్వకాలకు అనుమతి ఇచ్చిందన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు సర్వేలు కూడా పూర్తయ్యాయన్నారు. మన్ననూర్ బ్లాక్ కింద 38 చదరపు కి.మీ, పదర బ్లాక్ పరిధిలో 38 చదరపు కి.మీలతో పాటు దేవరకొండ రేంజ్‌లో రెండు ప్రాంతాల్లో కలిపి 76 చదరపు కి.మీలలో 283 హెక్టార్లలో, నాగార్జునసాగర్ ప్రాంతంలో లంబాపూర్‌లో 542 హెక్టార్లలో 18500 టన్నుల యురేనియం తవ్వకాలకు కేంద్రంలోని యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సన్నాహాలు చేస్తోందన్నారు.
దేశంలోని 13 ప్రాంతాల్లో ఈ పనులు చేస్తుండగా, తెలంగాణలో యురేనియం తవ్వకాలకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం అభ్యంతరం లేదని తమకు సమాచారం అందినట్లు చెప్పారు. దీంతో కేంద్రం అన్ని అనుమతులు ఇష్టంతో తవ్వకాలకు సంబంధించిన పనులు వేగంగా జరపనున్నారన్నాలరు. దీంతో చెంచులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారన్నారు. దేశంలో ఆమ్రాబాద్ అభయారణ్యం పులులకు నివాసయోగ్యమైన ప్రాంతమన్నారు. ఆనాదిగా ఈ ప్రాంతంలో చెంచులు అటవీ ప్రాంతాన్ని ఆసరా చేసుకుని వేలాది కుటుంబాలతో పాటు 60 వేలకుప ఐగా జనాభా నివసిస్తున్నాయన్నారు. ఒక వేళ యురేనియం తవ్వకాలు ప్రారంభిస్తే వేలాది చెంచులు ఇతర జనం ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ యురేనియం తవ్వకాలు ప్రారంభిస్తే వేలాది చెంచులు ఇతర జనం ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ యురేనియం తవ్వకాలతో వెలువడే విషవాయువుల వల్ల జంతు జాతులు నాశనమయ్యే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా యురేనియం నుంచి వచ్చే గాలులతో కాలుష్యం వెదజల్లి కాన్సర్ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. కొన్ని తరాల పాటు జన జీవనం అస్తవ్యస్తం కానుందన్నారు. అటు పులులు, ఇటు అటవీ ప్రాంతంలోని జంతు జాతులు, చెంచులు, వాతావరణ కాలుష్యం, తరాల పాటు జనం వ్యాధి పీడలకు గురయ్యే ప్రమాదం ఉందని, ఈ యురేనియం తవ్వకాలకు సంబంధించి అనుమతులను వెంటనే రద్దు చేసి ఆయా ప్రాంతాలకు నివసించే అటవీ జాతులను పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు.